న్యూఢిల్లీ: రూ.200 కోట్ల దోపిడీ, మనీలాండరింగ్ కేసులో ప్రముఖ బాలీవుడ్ నటి నోరా ఫతేహీకి ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. తీహార్ జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న ఈ కేసులో ఆమెను ప్రాసిక్యూషన్ సాక్షిగా కోర్టుకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం ఆదేశించింది. నవంబర్ 2న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని చెప్పింది. దర్యాప్తు సంస్థ దాఖలు చేసిన మూడో సప్లిమెంటరీ చార్జ్‌షీట్‌లో నోరా పేరును చేర్చారు. అయితే, ఆమెపై ఎలాంటి నేరారోపణలు లేవని, కేవలం సాక్షిగానే సమన్లు జారీ అయ్యాయని అధికారులు స్పష్టం చేశారు.
