
న్యూఢిల్లీ: ఇండియా షూటర్ మహేశ్వరి చౌహాన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. దోహాలో ఆదివారం ముగిసిన ఐఎస్‌ఎస్‌ఎఫ్ ఫైనల్ ఒలింపిక్ క్వాలిఫికేషన్ చాంపియన్‌షిప్ విమెన్స్ స్కీట్ ఈవెంట్‌లో మహేశ్వరి సిల్వర్ మెడల్ గెలిచింది. దాంతో ఇండియా తరఫున పారిస్‌లో 21వ కోటా సాధించింది. గోల్డ్ మెడల్ కోసం జరిగిన షూటాఫ్‌లో 3–4 తేడాతో చిలీకి చెందిన ఫ్రాన్సిస్కా క్రొవెటో ఛాడిడ్ చేతిలో ఓడింది. 60 షాట్ల ఫైనల్లో ఇద్దరు షూటర్లు చెరో 54 షాట్లతో సమంగా నిలిచారు. షూటాఫ్‌లో కాస్త తడబడిన మహేశ్వరి గోల్డ్ కోల్పోయింది.