
షాంగై: ఆర్చరీ వరల్డ్ కప్ స్టేజ్1లో ఇండియా మరో గోల్డ్ సహా మూడు మెడల్స్ గెలిచింది. ఏపీ కుర్రాడు బొమ్మదేవర ధీరజ్ గోల్డ్, బ్రాంజ్ మెడల్‌తో మెరిశాడు. ధీరజ్ తరుణ్ దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్‌తో కూడిన మెన్స్ రికర్వ్ టీమ్ 14 ఏండ్ల తర్వాత ఒలింపిక్ చాంపియన్ సౌత్ కొరియాను ఓడిస్తూ గోల్డ్ గెలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో ఇండియా 5–1 (57–-57, 57–-55, 55–-53) తో సౌత్ కొరియాను చిత్తు చేసింది.
వరల్డ్ కప్ ఫైనల్లో కొరియాపై ఇండియా మెన్స్ రికర్వ్ టీమ్‌కు ఇదే తొలి విజయం కావడం విశేషం. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో ధీరజ్–అంకితా భకట్ 6–0తో మెక్సికో జట్టును ఓడించి బ్రాంజ్ నెగ్గారు. విమెన్స్ రికర్వ్ వ్యక్తిగత విభాగంలో మాజీ వరల్డ్ నంబర్ వన్ దీపికా కుమారి సిల్వర్ సాధించింది. ఫైన్లలో దీపిక 0–6తో కొరియాకు చెందిన రెండో ర్యాంకర్ లిమ్ సిహైయోన్ చేతిలో ఓడిపోయింది.