నేను జిలేబి తినడం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా: గంభీర్

నేను జిలేబి తినడం వల్ల ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా: గంభీర్

తనపై విమర్శలు చేసిన ఆమ్ ఆదీ పార్టీ నేతలు, సోషల్ మీడియాలోని నెటిజన్లపై బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మండిపడ్డారు. తాను జిలేబి తినడానికి, ఢిల్లీలో కాలుష్యం పెరగడానికి సంబంధమేంటని ప్రశ్నించారు. జిలేబి తినడం వల్లే కాలుష్యం పెరిగిందంటే .. ఇకపై తినడం మానేస్తానని మీడియా ముందు అన్నారు.

గత కొన్ని రోజులుగా ఢిల్లీలో కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై అక్కడి పార్లమెంటరీ ప్యానెల్ కాలుష్యం అంశంపై సమావేశం నిర్వహించింది. దీనికి గౌతం గంభీర్ రాకపోవడంతో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలకు దిగింది. గౌతమ్ గంభీర్‌ కనపడటం లేదని ఆప్ నేతలు అక్కడి వీధుల్లో పోస్టర్లు అతికించేశారు. అతను ఎక్కడైనా కనబడితే మాకు తెలియజేయండంటూ అందులో పేర్కొన్నారు. అదే సమయంలో వీవీఎస్ లక్ష్మ‌ణ్‌తో పాటు గంభీర్  జిలేబీ తింటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఫోటోపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.

వీటిపై స్పందించాలంటూ గంభీర్ ను మీడియా అడగ్గా..నేను జిలేబి తినడం వల్లనే ఢిల్లీలో కాలుష్యం పెరిగిందా. అలా అయితే చెప్పండి. ఇక నేను జిలేబీ తినడమే మానేస్తా. 10నిమిషాల్లోనే నన్ను ట్రోలింగ్ చేయడం మొదలుపెట్టేశారు. ఈ కష్టమేదో ఢిల్లీ కాలుష్యం నివారించడంపై ఫోకస్ చేస్తే స్వేచ్ఛగా గాలి తీసుకోవచ్చు’ అని అన్నాడు .