ఐఐటీ–బాంబేలో ఈ సెమిస్టర్‌‌ ఆన్‌లైన్‌ మోడ్‌లోనే

ఐఐటీ–బాంబేలో ఈ సెమిస్టర్‌‌ ఆన్‌లైన్‌ మోడ్‌లోనే
  • కరోనా నేపథ్యంలో నిర్ణయం
  • ఈ నిర్ణయం తీసుకున్న మొదటి ఐఐటీ
  • జులైలో ప్రారంభం కానున్న సెమిస్టర్‌‌

బాంబే: కరోనా మహమ్మారి వ్యాప్తి చెందటంతో క్లాసులు ప్రారంభించే వీలు లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో ఐఐటీ – బాంబే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సెమిస్టర్‌‌కు ఆన్‌లైన్‌ క్లాసులు నిర్వహించాలని డిసైడ్‌ అయింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్టూడెంట్స్‌ భవిష్యత్తును, సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఐటీ బాంబే డైరెక్టర్‌‌ ప్రొఫెసర్‌‌ సుభాసిస్‌ చౌధురి చెప్పారు. సుదీర్ఘ చర్చల తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నామని అన్నారు. చాలా విద్యాసంస్థలు ఇప్పటికే ఆన్‌లైన్‌ క్లాసులు ప్రారంభించగా.. ఐఐటీల్లో మొదట స్టార్ట్‌ చేయనుంది ఐఐటీ – బాంబే. “ఐఐటీ – బాంబేకి మొదటి ప్రియారిటీ స్టూడెంట్స్. మహమ్మారి విజృంభిస్తున్న ఈ టైంలో స్టూడెంట్స్‌కు ఎలా హెల్ప్‌ చేయాలనేది ఆలోచించాం. అందుకే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. వచ్చే సెమిస్టర్‌‌ మొత్తం పూరిగా ఆన్‌లైన్‌ మోడ్‌లో నిర్వహించాలని నిర్ణయించాం” అని చౌధరి తన ఫేస్‌బుక్‌ ద్వారా చెప్పారు. జులై నుంచి సెమిస్టర్‌‌ ప్రారంభం కానుంది. కాగా.. ఎకనామికల్‌గా ఇబ్బందుల్లో ఉన్న స్టూడెంట్స్‌ ఫ్యామిలీస్‌కి హెల్ప్‌ చేయాలని కూడా చౌధురి తన ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఎకనామికల్‌గా పూర్‌‌గా ఉన్నవారికి ల్యాప్‌టాప్స్‌, నెట్‌ లాంటివి ఇచ్చి ఆదుకోవాలని అన్నారు.