తీహార్ జైలుకు చిదంబరం: 14రోజుల కస్టడీ

తీహార్ జైలుకు చిదంబరం: 14రోజుల కస్టడీ

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో  కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ లీడర్ చిదంబరంకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది సీబీఐ కోర్టు. దీంతో ఆయన ఈనెల 19వరకు తీహార్ జైలులో గడపనున్నారు. రెండు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయనను అధికారులు ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచగా… న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహార్ 14రోజుల జ్యడీషియల్ కస్టడీని చిదంబరానికి విధించారు. చిదంబరం వెంట అతనికి కావలసిన మెడిసిన్స్ తీసుకువెళ్లేందుకు అనుమతించారు. జైలులో చిదంబరానికి ప్రత్యేక గది, సరైన రక్షణ కల్పించాలని ఆయన తరపు న్యాయవాది కపిల్ సిబాల్ కోర్టును కోరారు.

తీహార్ జైలు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సందీప్ గోయెల్ మీడియాతో మాట్లాడారు. చిదంబరంకు జైలులో పప్పు, రోటీ ఇవ్వనున్నట్లు తెలిపారు. ఆయనను నెంబర్ 7 బ్యారక్ లో ఉంచనున్నట్లు చెప్పారు. కోర్టు పర్మిషన్ ఇస్తే వెస్ట్రన్ టాయ్లెట్ ఇస్తామని అన్నారు.