లైఫ్ ఇన్సూరెన్స్ పేమెంట్ గడువు పెంపు

లైఫ్ ఇన్సూరెన్స్ పేమెంట్ గడువు పెంపు

లాక్డౌన్ కారణంగా ఇన్సూరెన్స్ పాలసీ ప్రీ మియాలు చెల్లించలేనివారికోసం గడువును పెంచినట్టు ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవెలప్‌‌మెంట్ అథారిటీ (ఐఆర్డీఏ) ప్రకటించింది. మార్చి, ఏప్రిల్ నెలల్లో వాయిదా చెల్లించలేకపోయిన వారు 30 రోజుల లోపు డబ్బు కట్టవచ్చని తెలిపింది. ఇన్సూ రెన్స్ కంపెనీలు, లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ రిక్వెస్ట్ మేరకు ప్రీమియం చెల్లింపునకు ఈ 30 రోజుల గ్రేస్ పీరియడ్ ఇస్తున్నట్టు తెలిపింది. మూడు వారాల పాటు లాక్డౌన్ , సోషల్ డిస్టెన్సింగ్ విధించడం వల్ల ఇన్సూరెన్స్ పాలసీల ప్రీమియాలను చాలా మంది చెల్లించలేకపోయారని కంపెనీలు తెలిపాయి. అయితే మే 31తో మెచ్యూర్ అయ్యే యులిప్స్ మొత్తాన్ని రూల్స్ ప్రకారం సెటిల్ చేయాలని ఐఆర్డీఏ ఆదేశించింది. ఏప్రిల్‌ 14లోపు చెల్లించాల్సిన మోటార్, హెల్త్ పాలసీల ప్రీమియాలను ఈ నెల 21లోపు చెల్లించవచ్చని కూడా ఐఆర్‌డీఏ గత వారం ఆదేశాలు జారీ చేసింది. ఐతే, ఏ రోజు రెన్యువల్‌ చేసుకుంటారో ఆ రోజు నుంచే రిస్క్‌‌ కవరేజ్‌‌ మళ్లీ మొదలవుతుందని  స్పష్టం చేసింది. రెగ్యులేటరీ రిటర్న్‌ల ఫైలింగ్‌కూ ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ఐఆర్‌డీఏ వెసులుబాటు కల్పించింది. కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యం లో నెలవారీ రిటర్న్ ‌ల ఫైలింగ్‌కు మరో 15 రోజులు, క్వా ర్టర్లీ, హాఫ్‌ ఇయర్లీ, ఇయర్లీ రిటర్న్ ల ఫైలింగ్‌కు మరో 30 రోజులు అదనంగా టైమ్‌ ఇస్తున్నట్లు తెలిపింది.