నాలుగో టెస్టులో అశ్విన్‌కు దక్కని చోటు

నాలుగో టెస్టులో అశ్విన్‌కు దక్కని చోటు

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ నాలుగో టెస్టులో భారత జట్టు ఏర్పాటుపై  సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీనియర్ ఆఫ్‌ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, అభిమానులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంగ్లండ్‌లో స్పిన్‌కు బాగా సహకరించే ఓవల్ పిచ్‌పై అశ్విన్‌ను ఆడించకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు ఇక్కడ జరిగిన కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడిన అశ్విన్.. ఒక మ్యాచ్‌లో ఏకంగా 6 వికెట్లు కూల్చి సత్తా చాటాడు.

తన ప్రతిభను చాటుకున్న తర్వాత కూడా అశ్విన్ పక్కన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. మూడో టెస్టులో ఘోరపరాజయం తర్వాత టీమిండియాలో మార్పులుంటాయని అంతా భావించారు. అనుకున్నట్లే జట్టులో రెండు మార్పులు చేశారు. ఇషాంత్ శర్మ, మహమద్ షమీని తొలగించి వారి స్థానంలో ఉమేష్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌ను తీసుకున్నారు.