చైనా, పాకిస్తాన్‌ల నుంచి దిగుమతులను అనుమతించబోం

చైనా, పాకిస్తాన్‌ల నుంచి దిగుమతులను అనుమతించబోం

న్యూఢిల్లీ: ఇండో‌‌‌‌‌‌‌‌‌‌–చైనా బార్డర్‌‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చైనా నుంచి ఎలాంటి పవర్ ఎక్విప్‌మెంట్స్‌ను దిగుమతి చేసుకోబోమని కేంద్ర మంత్రి ఆర్‌‌కే సింగ్ శుక్రవారం తెలిపారు. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఎగుమతి అయ్యే పవర్ ఎక్విప్‌మెంట్స్‌ను తనిఖీల టైమ్‌లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. అలాగే స్టేట్ డిస్కంలు ఎక్విప్‌మెంట్‌ల సప్లయి కోసం చైనా ఫిర్మ్స్‌కు ఆర్డర్ చేయొద్దని ఆదేశించారు.

‘మేం ప్రతిదీ ఇక్కడే తయారు చేస్తాం. మొత్తంగా ఇండియా రూ.71 వేల కోట్ల విలువైన పవర్ ఎక్విప్‌మెంట్స్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీనిలో రూ.21 వేల కోట్లు చైనా నుంచి దిగుమతయ్యేవే. దీన్ని ఇక మీదట మేం సహించబోం. చైనా, పాకిస్తాన్‌ల నుంచి ఏదీ తీసుకోబోం. ఆయా దేశాల నుంచి ఎలాంటి దిగుమతులకు పర్మిషన్ ఇవ్వబోం. మనం తీవ్రంగా నష్టపోయాం. వాటిలో (చైనా నుంచి దిగుమతైన పవర్ ఎక్విప్‌మెంట్స్‌) హానికర మాల్‌వేర్, ట్రోజెన్‌ హార్స్‌ ఉండొచ్చు. వాటిని రిమోట్‌గానే (పవర్‌‌  సిస్టమ్స్‌ను కూల్చడానికి) ఆపరేట్ చేయొచ్చు’ అని ఆర్‌‌కే సింగ్ పేర్కొన్నారు.