జో రూట్‌‌  భారీ సెంచరీ.. ఇంగ్లండ్‌‌ 391 ఆలౌట్‌‌

జో రూట్‌‌  భారీ సెంచరీ.. ఇంగ్లండ్‌‌ 391 ఆలౌట్‌‌

లండన్‌‌‌‌: ఇండియాతో మ్యాచ్‌‌‌‌ అనగానే రెచ్చిపోయే ఇంగ్లండ్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ జో రూట్‌‌‌‌ (321 బాల్స్‌‌‌‌లో 18 ఫోర్లతో 180 నాటౌట్‌‌‌‌) మరోసారి దంచికొట్టాడు. తోటి ఆటగాళ్లు పెవిలియన్ బాట పడుతున్నా.. ఒక్కడే కోహ్లీసేన బౌలర్లకు ఎదురు నిలిచాడు. రూట్‌‌‌‌ వరుసగా రెండో సెంచరీతో చెలరేగడంతో ఇండియాతో రెండో టెస్టులో ఇంగ్లండ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో  27 పరుగుల స్వల్ఫ ఆధిక్యం సాధించింది.  ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ స్కోరు 119/3తో ఆట  కొనసాగించిన ఇంగ్లిష్‌‌‌‌ టీమ్‌‌‌‌ మూడో రోజు, శనివారం ఆట చివరకు   ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌లో 391 రన్స్‌‌‌‌కు ఆలౌటైంది. రూట్‌‌‌‌కు తోడు జానీ బెయిర్‌‌‌‌స్టో (57) ఫిఫ్టీతో రాణించాడు. ఇండియా బౌలర్లలో మహ్మద్‌‌‌‌ సిరాజ్‌‌‌‌(4/94) నాలుగు,  ఇషాంత్‌‌‌‌ శర్మ ( 3/69)  మూడు వికెట్లతో రాణించినా.. రూట్‌‌‌‌ జోరును అడ్డుకోలేకపోయారు. దాంతో, కోహ్లీసేనకు లీడ్‌‌‌‌ దక్కలేదు.  రూట్‌‌‌‌ కెరీర్‌‌‌‌లో ఇది 22వ సెంచరీ కాగా.. ఈ సీజన్‌‌‌‌లో ఐదోది. దాంతో, ఒక సీజన్‌‌‌‌లో ఐదు సెంచరీలు చేసిన ఇంగ్లండ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా నిలిచాడు. అలాగే, టెస్టుల్లో 9000 రన్స్‌‌‌‌ మైలురాయి కూడా దాటాడు. అలిస్టర్‌‌‌‌ కుక్‌‌‌‌ (12,472) తర్వాత ఇంగ్లండ్‌‌‌‌ తరఫున ఎక్కువ రన్స్‌‌‌‌ చేసిన క్రికెటర్‌‌‌‌గా రూట్‌‌‌‌ ( 9067) నిలిచాడు. 

అతనొక్కడే

థర్డ్‌‌‌‌ డే ఆటలో రూట్‌‌‌‌ ఆటే హైలైట్‌‌‌‌. తనదైన స్టయిల్లో అతను ఇండియా బౌలర్లను అద్భుతంగా ఎదుర్కొన్నాడు. మార్నింగ్‌‌‌‌ సెషన్‌‌‌‌లో అతనికి మరో ఓవర్‌‌‌‌నైట్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌ జానీ బెయిర్‌‌‌‌స్టో నుంచి మంచి సపోర్ట్‌‌‌‌ లభించింది.  ఇద్దరూ స్వేచ్ఛగా బౌండ్రీలు కొట్టారు. ఈ క్రమంలో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా షార్ట్‌‌‌‌ బాల్స్‌‌‌‌ వేస్తూ ఎక్కువ రన్స్‌‌‌‌ ఇచ్చిన సిరాజ్‌‌‌‌.. లంచ్‌‌‌‌ తర్వాత అదే షార్ట్‌‌‌‌బాల్‌‌‌‌ ప్లాన్‌‌‌‌తో జానీని ఔట్‌‌‌‌ చేశాడు. దాంతో, నాలుగో వికెట్‌‌‌‌కు 121 రన్స్‌‌‌‌ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌షిప్‌‌‌‌ బ్రేక్‌‌‌‌ అయింది. కాసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్న రూట్‌‌‌‌.. బట్లర్‌‌‌‌ (23)తో ఐదో వికెట్‌‌‌‌కు 54, మొయిన్‌‌‌‌ అలీ (27)తో ఆరో వికెట్‌‌‌‌కు 58 రన్స్‌‌‌‌ జోడించి టీ లోపే స్కోరు 300 దాటించాడు. బట్లర్‌‌‌‌, అలీతో పాటు సామ్‌‌‌‌ కరన్‌‌‌‌ (0)ను ఇషాంత్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేయగా.. ఒలీ రాబిన్సన్‌‌‌‌ (6)ను సిరాజ్‌‌‌‌  వెనక్కుపంపడంతో 357/8 స్కోరుతో నిలిచిన ఇంగ్లండ్‌‌‌‌ తొందర్లోనే ఆలౌటయ్యేలా కనిపించింది. కానీ, అప్పటికే 150 రన్స్‌‌‌‌ పూర్తి చేసుకున్న రూట్‌‌‌‌ ఏ మాత్రం వెనక్కుతగ్గలేదు. టెయిలెండర్లు   మార్క్‌‌‌‌ వుడ్‌‌‌‌ (5), అండర్సన్‌‌‌‌ (15 బాల్స్‌‌‌‌లో 0 )తో కలిసి టీమ్‌‌‌‌ను లీడ్‌‌‌‌లోకి తీసుకెళ్లాడు. ఆఖర్లో మరింత వేగంగా ఆడాడు. చివరకు షమీ బౌలింగ్‌‌‌‌లో అండర్సన్‌‌‌‌ బౌల్డ్‌‌‌‌ అవడంతో ఇంగ్లండ్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ముగిసింది. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: 364 ఆలౌట్‌‌‌‌;ఇంగ్లండ్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌: 391 ఆలౌట్‌‌‌‌ (రూట్​180 నాటౌట్‌‌‌‌, బెయిర్‌‌‌‌స్టో 57, సిరాజ్‌‌‌‌ 4/94,ఇషాంత్‌‌‌‌ 3/69).