యూఏఈలో కొత్త రూల్‌‌.. మన నర్సుల  ఉద్యోగాలకు ఎసరు

యూఏఈలో కొత్త రూల్‌‌.. మన నర్సుల  ఉద్యోగాలకు ఎసరు

యూఏఈలో కొత్త రూల్‌‌.. ఇప్పటికే 200 మందికి పోయిన జాబ్స్‌

దుబాయ్‌‌: యునైటెడ్‌‌ అరబ్‌‌ ఎమిరెట్స్‌‌ (యూఏఈ)లో పనిచేస్తున్న మన నర్సుల ఉద్యోగాలు చిక్కుల్లో పడనున్నాయి. యూఏఈలో నర్సుగా పని చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్‌‌ నర్సింగ్‌‌ చేసి ఉండాలన్న కొత్త రూల్‌‌ వల్ల డిప్లొమా చేసి నర్సులుగా పనిచేస్తున్న వారి ఉద్యోగాలు రిస్క్‌‌లో పడ్డాయని అక్కడి మీడియా చెప్పింది. యూఏఈలో నర్సు జాబ్‌‌ చేయడానికి కేరళ నుంచే ఎక్కువగా వెళ్తారు. ఇప్పటికే దాదాపు 200 మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. డిప్లొమా సర్టిఫికెట్‌‌ ఉన్న నర్సులు 2020 నాటికి యూఏఈలోని యూనివర్సీటీల్లో పోస్ట్‌‌ బేసిక్‌‌ బీఎస్సీ నర్సింగ్‌‌ ప్రోగ్రాం చేయాలని మినిస్ట్రీ చెప్పిందని, కొన్ని యూనివర్సిటీల్లో వారి డిప్లొమా సర్టిఫికెట్లకు సమానమైన సర్టిఫికెట్‌‌ ఇచ్చేందుకు తిరస్కరిస్తున్నారని బాధితులు మీడియాతో చెప్పారు.

కేరళలోని నర్సింగ్‌‌ కౌన్సిల్‌‌ ఇచ్చిన డిప్లొమా సర్టిఫికెట్‌‌నే మినిస్ట్రీ ఆఫ్‌‌ ఎడ్యుకేషన్‌‌ కూడా ఇష్యూ చేస్తోందని అన్నారు. “ మేము ఎక్కువ శాతం కేరళ నుంచి వచ్చాం. రాష్ట్రంలో కాకుండా బయట డిప్లొమా కోర్సులు చేశాం. మేమే కాదు ఇండియాలోని వేరే ప్రదేశాల నుంచి వచ్చిన నర్సులు ఈ ప్రాబ్లమ్‌‌ ఫేస్‌‌ చేస్తున్నారు. మాలో చాలా మందికి ఇప్పటికే ఉద్యోగాలు పోయాయి. మేం స్టడీస్‌‌ కంటిన్యూ చేయలేం. ఇప్పుడు మేము ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం” అని బాధితురాలు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై కేంద్ర మంత్రి మురళీధరన్‌‌ను కలిసి మాట్లాడతామని అన్నారు.