జూన్ రెండోవారంలో ఇంటర్ రిజల్ట్స్

జూన్ రెండోవారంలో ఇంటర్ రిజల్ట్స్

రెండు, మూడు రోజుల్లో వాల్యుయేషన్ ​పూర్తి
ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఒకేసారి విడుదల?

హైదరాబాద్, వెలుగు: కరోనా లాక్ డౌన్​ కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఇంటర్మీడియెట్ వాల్యుయేషన్  వేగంగా కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూన్ రెండోవారంలో రిజల్ట్స్ రిలీజ్​చేయాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. దీనికోసం వాల్యుయేషన్ ​ ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేసేలా టార్గెట్ పెట్టుకుంది. ప్రస్తుతం వాల్యుయేషన్ ​తో పాటు ఓంఎంఆర్​స్కానింగ్ ప్రాసెస్ కూడా కొనసాగుతోంది. అయితే ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు వేర్వురుగా ఇవ్వాలా? ఒకేసారి ఇవ్వాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

సెకండియర్ వాల్యుయేషన్  పూర్తి

ఇంటర్ సెకండియర్ వాల్యుయేషన్  మూడు రోజుల క్రితమే పూర్తయింది. ప్రస్తుతం ఓఎంఆర్​పార్ట్ 3 స్కానింగ్ ప్రాసెస్​కొనసాగుతోంది. ప్రస్తుతం ఫస్టియర్​ఇంగ్లిష్, సంస్కృతం, మ్యాథ్స్​వాల్యుయేషన్  కొనసాగుతోంది. మరో మూడు రోజుల్లో ఈ పేపర్లు దిద్దడం కూడా పూర్తవుతుందని అధికారులు చెప్తున్నారు. రిజల్ట్స్​ప్రాసెస్​ను వారం, పది రోజుల్లో పూర్తి చేయనున్నారు. గతంలో ముందు సెకండియర్ రిజల్ట్స్​ఇచ్చి, వారం తర్వాత ఫస్టియర్​ రిజల్ట్స్​ఇవ్వాలని అధికారులు అనుకున్నారు. కానీ వాల్యుయేషన్ ​ ప్రాసెస్ త్వరగా ముగియడంతో, ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్​ఒకేసారి ఇవ్వడంపై ఆలోచన చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వపెద్దలతో చర్చించిన తర్వాతే ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకునే అవకాశముంది.

తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీస్కున్నం

ఇంటర్ వాల్యుయేషన్  ప్రక్రియ ఈ నెలాఖరులో పూర్తవుతుంది. ప్రస్తుతం రెండు, మూడు సబ్జెక్టుల వాల్యుయేషన్ ​ కొనసాగుతోంది. వాల్యుయేషన్ ​తో సమాంతరంగా ఓఎంఆర్ ​స్కానింగ్ ప్రక్రియ జరుగుతోంది. గతంలో జరిగిన తప్పులు మరోసారి జరగకుండా జాగ్రతలు తీసుకుంటున్నాం. జూన్ ఫస్ట్​వీక్​లో రిజల్ట్స్​ప్రాసెస్​ పూర్తి చేసి, రెండోవారంలో ఫలితాలు విడుదల చేస్తాం. – ఉమర్ జలీల్, ఇంటర్ బోర్డు సెక్రెటరీ

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఒక్క మర్డర్ దాచడం కోసం 9 హత్యలు చేశాడు

V6 ఛానెల్ చొరవతో బెంగళూరు నుండి స్వ‌గ్రామానికి త‌ల్లీకూతుళ్లు 

నెటిజన్లు ఫిదా : బర్రె పగ తీర్చుకుంది.. ఆకతాయిల నడుం ఇరకొట్టింది