బస్సు లేట్: పరీక్ష హాల్ కు అనుమతించని అధికారులు

బస్సు లేట్: పరీక్ష హాల్ కు అనుమతించని అధికారులు

బస్సులు టైంకు రాకపోవడంతో ఇంటర్ పరీక్షకు లేటుగా వెళ్లిన విద్యార్థిని పరిక్షా హాల్ లోకి అనుమతించలేదు అధికారులు. ఈ ఘటన మహేశ్వరంలో జరిగింది. ఆర్టీసీ అధికారల తీరు మారాలంటూ బస్సు డిపో ముందు ధర్నా చేశారు ఏబీవీపీ నాయకులు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నియోజకవర్గమైన  మహేశ్వరంలోనే ఈ ఘటన జరిగింది.   శంషాబాద్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన బద్రి అనే విద్యార్థి శ్రీశారద ఓకేషనల్ జూనియర్ కాలేజీలో ఏంఎల్టీ కోర్సు మొదటి సంవత్సరం చదువుతుండగా మహేశ్వరంలోని జూనియర్ కాలేజీలో పరీక్ష కేంద్రం పడింది. అయితే… గొల్లపల్లి నుండి మహేశ్వరానికి ఉదయం 8 గంటలకు బస్సుకు వెళ్లివస్తున్నాడు. ఈరోజు ఆ బస్సు లేట్ గా రావడంతో విద్యార్థి పరీక్షా కేంద్రానికి 10 నిమిషాలు ఆలస్యంగా చేరుకున్నాడు. దీంతో అధికారులు అతడిని ఎగ్జామ్ హాలులోకి అనుమతించలేదు. మంకల గ్రామానికి చెందిన మరో విద్యార్థికి కూడా ఇలాగే జరిగింది. విద్యార్థులు సమయానికి చేరుకోకపోవడానికి ఆర్టీసీ అధికారుల తీరుతోనే విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని మహేశ్వరం ఆర్టీసీ డిపో ముందు ఏబీవీపీ విద్యార్థులు ధర్నాకు దిగారు. విద్యార్థులు పరీక్షల సమయంలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని డిమాండ్ చేశారు.