నితీష్, కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఆసక్తికర పరిణామం

నితీష్, కేసీఆర్ ప్రెస్ మీట్ లో ఆసక్తికర పరిణామం

సీఎం కేసీఆర్ బీహార్ పర్యటనలో ఓ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ సీఎం కేసీఆర్, బీహార్ సీఎం నితీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, బీజేపీ ప్రభుత్వంపై సీఎం కేసీఆర్ పలు విమర్శలు గుప్పించారు. బీజేపీ ముక్త్ భారత్ కోసం కలిసి పని చేస్తామని చెప్పారు. బీజేపీ పాలనలో దేశంలో తీవ్రంగా నష్టపోతోందని..బీజేపీ వ్యతిరేక శక్తులు ఏకం కావాలని చెప్పారు. ఈ క్రమంలో.. మీడియా పలు ప్రశ్నలు సంధించింది. కూటమి, పొత్తుల అంశాలను పదే పదే ప్రస్తావించింది. నితీష్ కుమార్ ప్రధాని అభ్యర్థిగా ఉండడానికి ఒప్పుకుంటారా ? లేక ఎవరుంటారని ప్రశ్నించారు.

దీంతో వివిధ పార్టీలతో భేటీయై నిర్ణయం తీసుకుంటామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఒక దశలో నితీష్ కు సంబంధించి ప్రస్తావన రాగా.. ఆయన కొంత ఇబ్బంది పడ్డారు. వెంటనే లేచి నిలబడి.. మీడియా సమావేశం అయిపోయిందని అన్నారు. ఆ సమయంలో సీఎం కేసీఆర్ కూర్చొనే ఉన్నారు. మీరు కూర్చొండి.. అంటూ నితీష్ ను అభ్యర్థించారు. అయినా.. కొద్దిసేపు ఆయన అలాగే నిలబడ్డారు. ఇలా రెండు, మూడుసార్లు జరిగింది. చివరకు రాజకీయాలు మాట్లాడనంటూ సీఎం కేసీఆర్ చెప్పడంతో సీఎం నితీష్ కూర్చొన్నారు.