ఐఫోన్ ను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు పోటీపడుతున్నారంటా

ఐఫోన్ ను హ్యాక్ చేసేందుకు హ్యాకర్లు పోటీపడుతున్నారంటా

బ్రాండెడ్ ఐఫోన్ ను కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తాన్నారా..? అయితే ఒక్క నిమిషం. ఐఫోన్ కొనుగోలు  చేయాలనుకుంటే మీ వ్యక్తిగత డేటా భద్రత మరిచిపోవాల్సిందేనని అంటోంది అమెరికాకు చెందిన సర్వే సంస్థ

ఇటీవల స్మార్ట్ ఫోన్లు హ్యాకింగ్ కు గురవుతున్నాయి. అయితే ఈ హ్యాకింగ్ పై కేస్ 24 సంస్థ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. స్మార్ట్ ఫోన్ల కంటే ఐఫోన్ 164రేట్ల డేంజర్ అని తేలింది.

మంథ్లీ గూగుల్ సెర్చెస్ ఆధారంగా కేస్ 24 ప్రతినిధులు సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో 700మంది శామ్ సంగ్ ను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, 10,400మంది ఐఫోన్ ను హ్యాక్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు తేలింది. ఎల్జీ, నోకియా, సోనీ ఫోన్ లపై కన్నెత్తి చూడని హ్యాకర్లు..ఏ బ్రాండ్ ఫోన్ ను హ్యాక్ చేయాలని 100సార్లు చెక్ చేస్తున్నారని సర్వేలో తేటతెల్లమైంది. అతితక్కువ హ్యాకర్లలో 50మంది సోని కంటే తక్కువ బ్రాండ్ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

అంతే కాదు 12,310 మంది బ్రిటిష్ ప్రజలు ఒకరి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ఎలా హ్యాక్ చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారు. హ్యాక్ అయ్యే ప్రమాదం ఉన్న ఇతర అనువర్తనాల్లో 1120 మంది  ఫేస్‌బుక్, 1070 మంది అమెజాన్,  750 మంది  నెట్‌ఫ్లిక్స్ లను హ్యాక్ చేసేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు సర్వేలో తేలింది.