V6 News

కేకేఆర్‌‌కు కెప్టెన్‌‌గా అతడే కరెక్ట్

కేకేఆర్‌‌కు కెప్టెన్‌‌గా అతడే కరెక్ట్

న్యూఢిల్లీ: ఢిల్లీ క్యాపిటల్స్‌‌తో జరిగిన మ్యాచ్‌‌లో కోల్‌‌కతా నైట్ రైడర్స్ పోరాడి ఓడింది. మ్యాచ్‌‌లో ఒక స్టేజ్‌‌లో కేకేఆర్ ఓడిపోతుందని అనిపించినా.. ఇయాన్ మోర్గాన్, రాహుల్ త్రిపాఠిల అద్భుత బ్యాటింగ్‌‌తో మళ్లీ రేసులోకి వచ్చింది. అయితే తక్కువ సమయంలో మోర్గాన్, త్రిపాఠి వెనుదిరగడంతో ఢిల్లీ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. కోల్‌‌కతా పరాజయంపై వెటరన్ సీమర్ ఎస్.శ్రీశాంత్ స్పందించాడు. కోల్‌‌కతా టీమ్ కెప్టెన్‌‌ను మార్చాల్సిన అవసరం ఉందన్నాడు. ఇంగ్లండ్ సారథి అయిన ఇయాన్ మోర్గాన్ కేకేఆర్‌‌ను ముందుండి నడిపించగలడని శ్రీశాంత్ సూచించాడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన మోర్గాన్ నాయకత్వం జట్టుకు మంచి చేస్తుందన్నాడు. ఈ సమస్యను నైట్ రైడర్స్ అధిగమిస్తుందని ఆశిస్తున్నానని చెప్పాడు. రోహిత్, ధోని, విరాట్‌‌లా జట్టును ముందుండి నడిపించే కెప్టెన్ అవసరం కేకేఆర్‌‌కు ఉందని శ్రీశాంత్ ట్వీట్ చేశాడు.