V6 News

వికారాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు చిక్కిన మహిళా సీఐ, ఎస్ఐ !

వికారాబాద్ జిల్లాలో ఏసీబీ వలకు చిక్కిన మహిళా సీఐ, ఎస్ఐ !

వికారాబాద్: వికారాబాద్ జిల్లాలో మహిళా పోలీస్ స్టేషన్ సీఐ, ఎస్ఐ లంచాల వ్యవహారం హాట్ టాపిక్ అయింది. భార్యాభర్త మధ్య జరిగిన గొడవ విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు సీఐ, ఎస్ఐ లంచం డిమాండ్ చేశారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ లంచాలకు మరిగిన మహిళా సీఐ, ఎస్సై బాగోతం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణానికి చెందిన షేక్ ఇర్షాద్ భార్య తనను భర్త వేధిస్తున్నాడని మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సెక్షన్ 498 కింద ఇర్షాద్, అతని ఫ్యామిలీపై మహిళా సీఐ సరోజా కేసు నమోదు చేశారు. ఇర్షాద్, అతని కుటుంబ సభ్యులు ఆరు మందిపై కేసు నమోదు చేసి స్టేషన్ బెయిల్ ఇస్తామని ప్రతి ఒక్కరికి పదివేల రూపాయలు చొప్పున ఇవ్వాలని సీఐ సరోజ, ఎస్సై రాణి 60 వేల లంచం డిమాండ్ చేశారు.

►ALSO READ | రూ. 25 వేలు లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన నారాయణపేట రెవెన్యూ ఆఫీసర్...

40 వేల రూపాయలు ఇస్తానని బాధితుడు ఒప్పుకున్నాడు. 20 వేల రూపాయలు సీఐ సమక్షంలో ఎస్ఐకి ఇవ్వగా మిగతా 20 వేల రూపాయలు ఇచ్చే క్రమంలో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో మహిళా పోలీస్ స్టేషన్లో తనిఖీలు నిర్వహించి విచారణ చేశారు. ఏసీబీ అధికారులు ఏక కాలంలో సీఐ సరోజ బంధువుల ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. భార్యాభర్తల కేసులో సీఐ సరోజ లక్షల రూపాయలు సొమ్ము చేసుకుందని, వికారాబాద్ జిల్లాలో పేద ప్రజల రక్తం తాగుతుందని  ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షించాలని తాండూరు కౌన్సిలర్ ఇర్షాద్ డిమాండ్ చేశాడు.