నారాయణపేటలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు రెవెన్యూ ఆఫీసర్. నారాయణపేట ఆర్దీవో ఆఫీసులో ఏవోగా పనిచేస్తున్న పత్లవత్ రామచందర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. మంగళవారం ( ఏప్రిల్ 21 ) నారాయణపేట ఆర్దీవో ఆఫీసులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. ఈ తనిఖీల్లో ఏవో రామచందర్ ను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.
బర్త్ సర్టిఫికెట్ కోసం రామచందర్ లంచం డిమాండ్ చేయడంతో ఏసీబీ ఆశ్రయించాడు బాధితుడు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. బాధితుడి నుండి రూ. 25 వేలు లంచం తీసుకుంటుండగా రామచందర్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు అదికారులు.
►ALSO READ | హైదరాబాద్ లో ఢిల్లీ మిఠాయి వాలా షాప్ తెలుసా..? ఇదే పేరుతో నకిలీ షాపులు ఉన్నాయంట..!
నిందితుడి అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరుస్తామని అన్నారు అధికారులు. రామచందర్ గతంలో కూడా అవినీతి, అక్రమ ప్రయోజనం ఆరోపణలు ఉన్నాయని తెలిపారు అధికారులు. ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు. 1064 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు అధికారులు.

