తాడిచెర్ల-2 ప్రాజెక్టును వేగవంతం చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్

తాడిచెర్ల-2 ప్రాజెక్టును వేగవంతం చేయాలి.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని కోరిన ఎంపీ వంశీకృష్ణ, మంత్రి వివేక్

ఢిల్లీలో కేంద్ర బొగ్గు , గనుల శాఖ మంత్రి  కిషన్ రెడ్డిని పెద్దపల్లి  ఎంపీ గడ్డం వంశీకృష్ణ, తెలంగాణ రాష్ట్ర గనులు, కార్మిక శాఖ మంత్రి  వివేక్ వెంకటస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి నియోజకవర్గానికి అత్యంత కీలకమైన తాడిచెర్ల-2 బొగ్గు గని ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు ద్వారా స్థానిక యువతకు కనీసం వెయ్యి ఉద్యోగాలు కల్పించాలని, ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. అలాగే, నిర్వాసితులైన కుటుంబాలకు R&R ప్యాకేజీ కింద సమగ్ర పునరావాస సౌకర్యాలు కల్పించాలని అభ్యర్థించారు.

అదేవిధంగా, సింగరేణి సంస్థలో పదవీ విరమణ పొందిన కార్మికులకు కనీస నెలవారీ పెన్షన్ పదివేల రూపాయలు అందేలా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సింగరేణి సంస్థ అభివృద్ధి, గనుల విస్తరణ, మౌలిక వసతుల కల్పనపై కూడా చర్చించారు.

►ALSO READ | హైడ్రా కమిషనర్ గా రంగనాథ్ ను తొలగించండి : హైకోర్టు

వీరి విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాడిచెర్ల-2 ప్రాజెక్టు పనుల వేగవంతం, ఉద్యోగాల కల్పన, R&R ప్యాకేజీ అమలు, సింగరేణి రిటైర్డ్ కార్మికుల పెన్షన్ అంశాలపై సంబంధిత శాఖలతో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.