V6 News

హైదరాబాద్ లో ఢిల్లీ మిఠాయి వాలా షాప్ తెలుసా..? ఇదే పేరుతో నకిలీ షాపులు ఉన్నాయంట..!

హైదరాబాద్ లో ఢిల్లీ మిఠాయి వాలా షాప్ తెలుసా..? ఇదే పేరుతో నకిలీ షాపులు ఉన్నాయంట..!

హైదరాబాద్ లో ఢిల్లీ మిఠాయివాలా షాప్ గురించి తెలిసే ఉంటుంది. ఈ పేరుతో స్వీట్స్ షాప్స్ చాలా ఏరియాల్లో చూసుంటారు. అయితే.. కనిపించే ప్రతి ఢిల్లీ మిఠాయివాలా షాప్ ఒరిజినల్ కాదంట...! ఇదే పేరుతో నకిలీ షాపులు నడుపుతున్నారంట. ఈమేరకు ఢిల్లీ మిఠాయివాలా అసలు యజమాని జితేందర్ కాచ్వాహ కోర్టును ఆశ్రయించాడు. సిటీలో ఢిల్లీ మిఠాయివాలా పేరుతో నడుస్తున్న నకిలీ దుకాణాలపై చేసిన నయయపోరాటంలో విజయం సాధించారు జితేందర్.

ఢిల్లీ మిఠాయి వాలా పేరును 1968 నుంచే తమ పేరుతో రిజిస్టర్ చేసుకున్నామని, అదే పేరును ఇతరులు వినియోగించడం వల్ల తమ బ్రాండ్ ప్రతిష్టకు భంగం కలుగుతోందని కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన , ప్రిన్సిపల్ కమర్షియల్ కోర్టు, న్యాయమూర్తి ఉదయ్ కుమార్, ఈ బ్రాండ్ హక్కులు జితేందర్ కాచ్వహ కే చెందుతాయని స్పష్టం చేస్తూ అనుకూల తీర్పు ఇచ్చారు. 

►ALSO READ | మండే ఎండల నుండి ట్రాఫిక్ సిబ్బందికి రిలీఫ్... హైదరాబాద్ పోలీసుల సూపర్ ఐడియా...

ఈ క్రమంలో  కోర్టు ఆదేశాల మేరకు సిటీలోని నాలుగు దుకాణాలకు ఢిల్లీ మిఠాయి పేరును పోలీసుల సమక్షంలో తొలగించారు. హైదరాబాద్ లో ఎవరైనా ఢిల్లీ మిఠాయివాలా పేరును అనధికారికంగా వినియోగిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.