‘షాద్నగర్’ చౌరస్తా విస్తరణకు లైన్ క్లియర్

‘షాద్నగర్’ చౌరస్తా విస్తరణకు లైన్ క్లియర్

షాద్ నగర్, వెలుగు: షాద్​నగర్ చౌరస్తా విస్తరణ కోసం నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్​విజయవంతమైందని ఆర్డీవో సరిత ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయ పార్టీల నాయకులు, అధికారులతో ఈ అంశంపై చర్చించినట్లు పేర్కొన్నారు. సోమవారం నుంచి చౌరస్తా పరిధిలో ఉన్న ఆక్రమణలను ఎలాంటి మినహాయింపులు లేకుండా తొలగించాలని ఆదేశించామన్నారు.

రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, రోడ్లు, భవనాలు తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి, ఆక్రమణల తొలగింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలని సూచించారు.