V6 News

Abhishek Sharma: ఢిల్లీపై అభిషేక్ కిరాక్ సెంచరీ.. రికార్డులు ఇవే!

Abhishek Sharma: ఢిల్లీపై అభిషేక్ కిరాక్ సెంచరీ.. రికార్డులు ఇవే!

Abhishek Sharma: టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 క్రికెట్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నాడు. 5,500 రన్స్ ఘనతను అతడు కంప్లీట్ చేసుకున్నాడు. 2026 ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 71వ పరుగు పూర్తి చేసిన సమయంలో అభిషేక్ ఈ మైలురాయిని సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే టీ20 ఫార్మాట్‌లో అత్యంత ప్రభావవంతమైన బ్యాటర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన అభి,  తన దూకుడైన బ్యాటింగ్‌తో వేగంగా రన్స్ సాధిస్తున్నాడు. అంతర్జాతీయ టీ20ల్లో కూడా శర్మ 1,400కు పైగా పరుగులు సాధించాడు. 

ఐపీఎల్‌లో 2 వేల పరుగుల రికార్డు: 
2018లో టీ20లోకి ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ శర్మ, 188వ మ్యాచ్‌లో 5,500 పరుగుల మార్క్‌ను అందుకున్నాడు. 184 ఇన్నింగ్స్‌లలో అతడు సగటు 32కు పైగా ఉండగా, స్ట్రైక్ రేట్ 170కి పైగా నమోదు చేసుకోవడం విశేషం. ఇప్పటి వరకు అతడి ఖాతాలో 9 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే ఐపీఎల్‌లో అభిషేక్ కు 2,000కు పైగా రన్స్ ఉండగా, భారత జట్టుకు ఆడిన 46 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 1,438 పరుగులు రాబట్టాడు. 
 
అభిషేక్ శర్మ రికార్డులివే..
* ఐపీఎల్ లో 9 సెంచరీలు పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ..
* ఐపీఎల్ లో విరాట్ కోహ్లీతో సమానంగా కొనసాగుతున్న అభిషేక్..
* ఐపీఎల్ లో 8 సెంచరీలు చేసిన రోహిత్ శర్మని వెనక్కి నెట్టిన అభిషేక్ శర్మ..
* అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 170కి పైగా ఉండటం గమనార్హం.. 
* అంతర్జాతీయ స్థాయిలో కూడా అభిషేక్ శర్మ స్ట్రైక్ రేట్ 190.46గా ఉంది.. 
* 2,898 బంతుల్లో 5,000 టీ20 రన్స్ కంప్లీట్ చేసి, అత్యంత వేగంగా ఈ మైలురాయిని అందుకున్న ప్లేయర్ గా నిలిచిన అభిషేక్.. 
* 160కి పైగా స్ట్రైక్ రేట్‌తో 5,000 టీ20 రన్స్ చేసిన ఇద్దరు ఆటగాళ్లలో అభిషేక్ శర్మ ఒకరు..