V6 News

ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ విశ్వరూపం.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో SRH ఘనవిజయం

ఉప్పల్‌లో ఆరెంజ్ ఆర్మీ విశ్వరూపం.. ఢిల్లీపై 47 పరుగుల తేడాతో SRH ఘనవిజయం

SRH vs DC:

SRH vs DC: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026లో భాగంగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన హైస్కోరింగ్ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ 47 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఆరెంజ్ ఆర్మీ బ్యాటర్లు శివతాండవం చేశారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ సునామీ సెంచరీతో స్టేడియాన్ని హోరెత్తించడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 2 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది. 

అనంతరం 243 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకి ఆశించిన ఆరంభం లభించలేదు. 21 పరుగుల వద్ద దిల్షాన్ మధుశంక బౌలింగ్ లో ఢిల్లీ ఓపెనర్ పథుమ్ నిస్సాంక(8) పెవిలియన్ కి చేరుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నితీశ్ రాణాతో కలిసి కేఎల్ రాహుల్ తో కలిసి ఇన్సింగ్స్ ని నిర్మించాడు. ఈక్రమంలో వీరిద్దరి మధ్య నెలకొన్న 87 పరుగుల భాగస్వామ్యానికి బ్రేక్ పడింది. ఆ తర్వాత 107 పరుగులు వద్ద కీలకమైన 3 వికెట్లని ఢిల్లీ క్యాపిటల్స్ కోల్పోయింది. ఫస్ట్ కేఎల్ రాహుల్ (23 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సులతో 37 పరుగులు)ని సాకీబ్ హుస్సేన్ బౌలింగ్(9.4 ఓవర్లో) లో క్యాచ్ ఔట్ అయ్యాడు. 

ఆ తర్వాత ఎషాన్ మలింగ బౌలింగ్(10.1 ఓవర్లో) లో హాఫ్ సెంచరీతో చెలరేగిన నితీష్ రాణా (30 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సులతో 57 పరుగులు) ఔట్ కాగా,  ఆ తర్వాత బంతికే డేంబర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 107 పరుగులకే 4 వికెట్లని కోల్పోయి కష్టాల్లో పడింది ఢిల్లీ. అనంతరం బ్యాటింగ్ కి వచ్చిన ట్రిస్టాన్ స్టబ్స్ (27) కాసేపు మెరుపు బ్యాటింగ్ చేసినప్పటికీ ఎషాన్ మలింగ బౌలింగ్ (15.5 ఓవర్లో) లో సాకీబ్ హుస్సేన్ కి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. 

కానీ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చిన ఆశుతోష్ శర్మ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయాడు. అక్షర్ పటేల్(2), కుల్దీప్ యాదవ్ (1), లుంగి ఎంగిడి (0) త్వరగానే పెవిలియన్ కి చేరుకోవడంతో.. మరో ఎండ్ లో ఉన్న సమీర్ రిజ్వీ (41 నాటౌట్) మాత్రం చివర్లో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. వేగంగా పరుగులు చేస్తూ, నెట్ రన్ రేట్ తగ్గించే ప్రయత్నం  చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. దీంతో 47 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఘోరంగా ఓడిపోయింది. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లలో ఎషాన్ మలింగ కీలకమైన 4 వికెట్లని తీసుకుని ఢిల్లీ జట్టు పతనాన్ని శాసించగా, హర్ష్ దూబే మూడు వికెట్లు తీసుకోగా, దిల్షాన్ మధుశంక, సాకీబ్ హుస్సేన్ చెరో వికెట్ పడగొట్టారు.