అమ్మాయిలు రాను రాను మరీ వాయిలెంట్ గా తయారవుతున్నారు బాస్... భర్తను చంపేసి డ్రమ్ములో దాచేసింది ఓ భార్యామణి. హనీమూన్ తీసుకెళ్లి భర్తను చంపేసి కిడ్నాప్ డ్రామా ఆడింది ఓ మహానటి. మొన్నటికి మొన్న నల్లగా ఉన్నాడని భర్తను చంపి.. దోపిడీ దొంగల డ్రామా అంటూ రక్తి కట్టించింది మరో వీరనారి... ఇలాంటి దారుణాలు చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవి మరువక ముందే మరో దారుణం జరిగింది. లవర్ ను ఇంటికి పిలిచి... కళ్ళకు గంతలు కట్టి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి తగలబెట్టింది ఓ యువతి. బెంగళూరులో జరిగింది ఈ దారుణం. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి..
బెంగుళూరులోని ఓ టెలికాం స్టోర్ లో పని చేసే 27 ఏళ్ళ ప్రేరణ అదే స్టోర్ లో పనిచేసే కిరణ్ అనే అబ్బాయితో ప్రేమలో ఉంది. ఏడాది పాటులో ఇద్దరి ప్రేమ వ్యవహారం బాగానే సాగింది కానీ... ఈ మధ్య కిరణ్ తనకు అటెన్షన్ ఇవ్వట్లేదని ఫీల్ అయ్యింది ప్రేరణ. దీంతో కిరణ్ తనకు పెళ్లి చేసుకోడేమో అన్న భయం ప్రేరణకు కలిగింది. ఈ క్రమంలో తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్న ప్రేరణ... మంగళవారం ( ఏప్రిల్ 21 ) వారు ఇంట్లో లేని సమయంలో కిరణ్ రమ్మని పిలిచింది.
►ALSO READ | కేరళలో భారీ అగ్నిప్రమాదం... బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు...13 మంది మృతి
కిరణ్ తో కాసేపు మాట్లాడిన ప్రేరణ..తాను వేసుకున్న స్కెచ్ అమలు చేయడం స్టార్ట్ చేసింది. అతని కళ్ళకు గంతలు కట్టి... కుర్చీలో కూర్చోబెట్టింది. ఆ తర్వాత చేతులు కాళ్ళు కట్టేసింది. ఎందుకు కట్టేస్తున్నావంటూ కిరణ్ అడుగగా.. ఫారిన్ లో ట్రెండ్ అవుతున్న స్టైల్ ప్రపోజ్ చేస్తున్నానంటూ నమ్మించింది. అలా కిరణ్ చేతులు కాళ్ళు కట్టేసి కిరోసిన్ పోసి నిప్పటించింది. అంతే... లవర్ ఎదో సరదా పడుతోందిలే అని గుడ్డిగా నమ్మి కళ్ళకు గంతలు కట్టించుకున్న కిరణ్.. ప్రేరణ ఉన్మాదపు మంటల్లో కనుమూశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ప్రేరణను అదుపులోకి తీసుకున్నామని.. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

