ఇరాన్ లో పబ్లిగ్గా ప్రపోజ్.. జంట అరెస్ట్

ఇరాన్ లో పబ్లిగ్గా ప్రపోజ్.. జంట అరెస్ట్

అది ఇరాన్ లోని అరక్ నగరం. కస్టమర్లతో ఓ పెద్ద షాపింగ్ మాల్ కిటకిటలాడుతోంది. ఫుల్ రష్. ఓ అమ్మాయి, అబ్బాయీ వచ్చారు. పూలతో హార్ట్ ను అందంగా అలంకరించాడా యువకుడు. ‘‘నన్ను పెళ్లి చేసుకుంటావా?” అంటూ తన మనసులోని మాటను ఆమెకు చెప్పాడు . అందరి ముందూ అతడలా ప్రపోజ్ చేసే సరికి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ‘ఓకే’ చెప్పేసింది. ఆ అమ్మాయి, అబ్బాయి ఫుల్ హ్యాపీ. కానీ, ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు . పోలీసులు ఆ ఇద్దరినీ అరెస్ట్ చేశారు. ప్రపోజ్ చేస్తే నేరమా? అంటే ఇరాన్ లో అంతే మరి.ఇస్లాం సిద్ధాంతాల ఉల్లంఘన కిందకు వస్తుందక్కడ. పెళ్లికాని అమ్మాయిలు అబ్బాయితోగానీ, అబ్బాయిలు అమ్మాయిలతో గానీ మాట్లాడడం, తిరగడం నిషిద్ధం. ఇంత పబ్లిగ్గా ప్రపోజ్ చేయడానికి ‘సిగ్గుండాలి ’ అంటూ అధికారిక పత్రిక (సెమీ అఫీషియల్ ) ఫార్స్ న్యూస్ వార్త రాసింది. చివరకు వారిని బెయిల్‌‌పై విడిచిపెట్టారు.