ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డు

 ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకోవడానికి క్రెడిట్ కార్డు
  • టికెట్స్ బుక్ చేసుకోవడానికి
  • ఐఆర్‌‌‌‌సీటీసీ నుంచి మరో క్రెడిట్‌‌ కార్డు

న్యూఢిల్లీ: తరచూ ట్రెయిన్ టికెట్లను బుక్ చేసుకునేవారి కోసం మరో కో–బ్రాండెడ్‌‌ క్రెడిట్‌‌కార్డును ఐఆర్‌‌‌‌సీటీసీ  లాంచ్ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్, నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌‌ (ఎన్‌‌పీసీఐ)తో కలిసి ఈ క్రెడిట్‌‌కార్డును తీసుకొచ్చింది. ఈ కార్డులను కేవలం టికెట్స్ బుకింగ్స్ కోసమే కాకుండా గ్రోసరీ కొనుగోలుకు, షాపింగ్‌‌కు వాడుకోవచ్చని బీఓబీ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ప్రకటించింది. ప్రస్తుతం సగటున రోజుకి 6.6 కోట్ల మంది యూజర్లు ఐఆర్‌‌‌‌సీటీసీ వెబ్‌‌సైట్‌‌ లేదా యాప్ ద్వారా టికెట్లు బుక్‌‌ చేసుకుంటున్నారు.  తరచూ ట్రావెల్ చేసే వారు వీలున్నంత ఎక్కువగా సేవ్ చేసుకోవడానికి వీలు కలిపిస్తూ ‘ఐఆర్‌‌‌‌సీటీసీ బీఓబీ రూపే కాంటాక్ట్‌‌లెస్‌‌ క్రెడిట్‌‌ కార్డ్‌‌’ ను లాంచ్ చేశామని ఎన్‌‌పీసీఐ ప్రకటించింది. ఈ క్రెడిట్ కార్డుతో  1ఏసీ, 2ఏసీ, 3ఏసీ, సీసీ లేదా ఈసీ టికెట్లపై కనీసం రూ. 100 ఖర్చు చేస్తే 40 వరకు రివార్డు పాయింట్లను పొందొచ్చు. కస్టమర్ల ట్రెయిన్ బుకింగ్స్‌‌పై 1 శాతం ట్రాన్సాక్షన్‌‌ ఫీజు ఉండదు. కార్డు ఇష్యూ చేసిన 45 రోజుల్లోనే రూ.1,000 లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తే 1,000  రివార్డ్‌‌ పాయింట్లను రివార్డ్‌‌గా పొందొచ్చు. రైల్వే లాంజ్‌‌లలో ఏడాదికి నాలుగు కాంప్లిమెంటరీ విజిట్స్‌‌కు అవకాశం ఇస్తారు. ఐఆర్‌‌‌‌సీటీసీ వెబ్‌‌సైట్‌‌లో లేదా యాప్‌‌లో లాగిన్ అయినప్పుడు యూజర్లు తమ లాయల్టీ నెంబర్ (కార్డుపై ఉంటుంది) ను లింక్ చేసుకోవచ్చు. రివార్డ్ పాయింట్లతో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.