ఫస్ట్ వన్డేలో ఫిఫ్టీ కొట్టిన బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్

ఫస్ట్ వన్డేలో ఫిఫ్టీ కొట్టిన బర్త్ డే బాయ్ ఇషాన్ కిషన్

కొలంబో: ‘ఇండియా సెకండ్‌‌‌‌ స్ట్రింగ్‌‌‌‌ టీమ్‌‌‌‌తో సిరీస్‌‌‌‌కు ఒప్పుకోవడం శ్రీలంకకు అవమానం’ అన్న లంక మాజీ కెప్టెన్‌‌‌‌ అర్జున రణతుంగకు ధవన్‌‌‌‌ అండ్‌‌‌‌ కో తమ ఆటతోనే దీటైన సమాధానం చెప్పింది.   ఫస్ట్‌‌‌‌ వన్డేలో  శ్రీలంకను చిత్తు చేసి సిరీస్‌‌‌‌ను, టూర్‌‌‌‌ను గ్రాండ్‌‌‌‌గా ఆరంభించింది. బర్త్‌‌‌‌డే బాయ్‌‌‌‌, డెబ్యూ ప్లేయర్‌‌‌‌ ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (42 బాల్స్‌‌‌‌లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 59) వన్డే కెరీర్‌‌‌‌ను కూడా ఫిఫ్టీతో షురూ చేశాడు. మరో యంగ్‌‌‌‌స్టర్‌‌‌‌ పృథ్వీ షా (24 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లతో 43)మెరుపులు,  శిఖర్‌‌‌‌ ధవన్‌‌‌‌ (95 బాల్స్‌‌‌‌లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌‌‌‌తో 86 నాటౌట్‌‌‌‌) కెప్టెన్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌తో మూడు వన్డేల సిరీస్‌‌‌‌లో భాగంగా ఆదివారం జరిగిన ఫస్ట్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో లంకపై గ్రాండ్‌‌‌‌ విక్టరీ సాధించింది. తొలుత లంక 50 ఓవర్లలో 262/9 స్కోరు చేసింది. చమిక కరుణరత్నె (43 నాటౌట్‌‌‌‌), కెప్టెన్‌‌‌‌ దసున్‌‌‌‌ షనక (39), చరిత్ అసలంక (38), అవిష్క ఫెర్నాండో (33) రాణించారు. ఇండియా బౌలర్లలో  స్పిన్నర్లు కుల్దీప్‌‌‌‌ యాదవ్‌‌‌‌ (2/48), యుజ్వేంద్ర చహల్‌‌‌‌ (2/52)తో పాటుపేసర్‌‌‌‌ దీపక్‌‌‌‌ చహర్‌‌‌‌ (2/37) సత్తా చాటాడు.  ఇండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీసినా లాస్ట్​ 10 ఓవర్లలో చమిక వేగంగా ఆడి లంకకు మంచి స్కోరు అందించాడు.  అనంతరం షా, ఇషాన్‌‌‌‌,  ధవన్‌‌‌‌ మెరుపులతో ఇండియా 36.4 ఓవర్లలోనే 263/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. పృథ్వీకి ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ అవార్డు దక్కింది. సెకండ్‌‌‌‌ వన్డే మంగళవారం జరగనుంది. 
ధనాధన్‌‌‌‌ ఫటాఫట్‌‌‌‌
ఛేజింగ్‌‌‌‌లో పృథ్వీషా, తన 23వ బర్త్​డే రోజున ఇషాన్‌‌‌‌ భారీ షాట్లతో మ్యాచ్‌‌‌‌ను వన్‌‌‌‌సైడ్‌‌‌‌ చేశారు. ధవన్‌‌‌‌తో కలిసి ఓపెనింగ్‌‌‌‌కు వచ్చిన పృథ్వీ టీ20 స్టయిల్లో వరుస పెట్టి ఫోర్లు కొట్టాడు. తొలి ఐదు ఓవర్లలో 57 రన్స్‌‌‌‌ వస్తే తనే 43 రన్స్‌‌‌‌ చేశాడంటే షా స్పీడు అర్థం చేసుకోవచ్చు. ఆరో ఓవర్లో మరో షాట్‌‌‌‌కు ప్రయత్నించి ఔటయ్యాడు. అయితే, వన్‌‌‌‌డౌన్‌‌‌‌లో వచ్చిన ఇషాన్‌‌‌‌ తొలి రెండు బాల్స్‌‌‌‌ను 6, 4 కొట్టి ఔరా అనిపించాడు. ధనంజయ బౌలింగ్‌‌‌‌లో హ్యాట్రిక్‌‌‌‌ ఫోర్లు బాదిన కిషన్‌‌‌‌..  13వ ఓవర్లో 6,4.. ఆపై 15వ ఓవర్లో 4, 4తో 33 బాల్స్‌‌‌‌లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. దాంతో,  ఊతప్ప తర్వాత టీ20, వన్డే డెబ్యూ మ్యాచ్‌‌‌‌ల్లో ఫిఫ్టీ చేసిన ఇండియా సెకండ్‌‌‌‌ బ్యాట్స్‌‌‌‌మన్‌‌‌‌గా నిలిచాడు. 18వ ఓవర్లో ఇషాన్‌‌‌‌ను  సందకన్‌‌‌‌ ఔట్‌‌‌‌ చేసే టైమ్‌‌‌‌కు ఇండియా 143/2తో విజయం ఖాయం చేసుకుంది. ఈ టైమ్​లో జోరు పెంచిన ధవన్.. పాండే (26),  డెబ్యూ ప్లేయర్‌‌‌‌ సూర్యకుమార్‌‌‌‌ (31 నాటౌట్‌‌‌‌)తో కలిసి లాంఛనం పూర్తి చేశాడు.