న్యూఢిల్లీ: ఇండియా షూటర్లు నీరూ ధండా–వివాన్ కపూర్ జోడీ.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ వరల్డ్ కప్ షాట్ గన్ టోర్నీలో కాంస్య పతకంతో మెరిశారు. ఆదివారం జరిగిన ట్రాప్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో నీరూ–వివాన్ 24 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచారు. ఒలింపిక్ ఈవెంట్‌గా గుర్తింపు పొందిన తర్వాత ఈ విభాగంలో నీరూ, వివాన్‌కు ఇదే తొలి పతకం కావడం విశేషం. ఓవరాల్‌గా ఇండియాకు రెండో మెడల్ ఇది.
ఇటలీ ద్వయం సిల్వానా స్టాన్కో–మౌరో డి ఫిలిప్పీస్ 24 పాయింట్లే సాధించినా.. క్వాలిఫికేషన్స్‌లో రెండు పాయింట్లు ముందుండటంతో సిల్వర్ ఖాయమైంది. చైనీస్ తైపీ జోడీ కున్‌పి యాంగ్–వాన్ యు లియు 36 పాయింట్లతో వరల్డ్ రికార్డు నమోదు చేసి గోల్డ్ మెడల్‌ను సొంతం చేసుకున్నారు.
