నల్గొండలో ఐటీ దాడులు కలకలం సృష్టిస్తున్నాయి. మంత్రి జగదీష్ రెడ్డి పీఏ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు . నల్గొండలోని తిరుమల నగర్ లో పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. స్థానిక పోలీసుల్ని కూడా ఇంట్లోకి అనుమతి ఇవ్వడం లేదు ఐటీ అధికారులు. ప్రభాకర్ రెడ్డి కుటుంబ సభ్యుల్ని మాత్రమే ఇంట్లోకి అనుమతిస్తున్నారు.
రేపు సాయంత్రంతో మునుగోడు బైపోల్ ప్రచారం ముగియనుంది. బైపోల్ ఓటింగ్ కు మరో రెండ్రోజులు మాత్రమే టైం ఉంది. మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి TRS వ్యవహారాలన్నీ మంత్రి జగదీష్ రెడ్డి దగ్గరుండి చూసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జగదీష్ రెడ్డి పీఏ ఇంట్లో ఐటీ రైడ్స్ జరగడం ఆసక్తి రేపుతోంది.
