మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇలాకాలో అన్నదాతలు రోడ్డెక్కారు. ధాన్యం పోసి నెల రోజులు అవుతున్న కొనుగోలు చేయడం లేదని మే 11వ తేదీ గురువారం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని చిల్వ కోడూరు గ్రామ రైతుల ధర్నా దిగారు. జగిత్యాల పెద్దపల్లి రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపారు. దీంతో రోడ్డుపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
మ్యాచర్ వచ్చినా ధ్యానం తీసుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అకాల వర్షాలకు ధాన్యం తడిసి నష్టపోయామని.. బస్తాకు మూడు కిలోలు తరుగు తీసుకున్నారని రైతుల మండిపడుతున్నారు. జిల్లా కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చేంతవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని.. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో సమాచరం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

