V6 News

PEDDI: పెద్ది స్పెషల్ సాంగ్‌పై రోజుకో ట్విస్ట్.. సందిగ్ధంలో పడ్డ బుచ్చి బాబు.. ఆ ఐటెం భామ ఎవరు?

PEDDI: పెద్ది స్పెషల్ సాంగ్‌పై రోజుకో ట్విస్ట్.. సందిగ్ధంలో పడ్డ బుచ్చి బాబు.. ఆ ఐటెం భామ ఎవరు?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూపొందుతున్న భారీ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. జాన్వీ కపూర్ హీరోయిన్. మంగళవారం ఏప్రిల్ 21న ఈ మూవీ నుంచి అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ ఇచ్చారు మేకర్స్. చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, మరో ఆరు  రోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుందని తెలియజేశారు. ఈ క్రమంలోనే పెద్ది స్పెషల్ సాంగ్పై ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే.. 

స్పెషల్ సాంగ్‌పై తాజా బజ్..

పెద్దిలో స్పెషల్ సాంగ్ ఉండొచ్చని చాలా కాలంగా టాక్ ఉంది. మొదట ఈ పాటలో రామ్ చరణ్తో స్టెప్పులేసేది మృణాల్ ఠాకూర్, పూజా హెగ్దే, సమంత, కాజల్ అగర్వాల్, శ్రీలీల ఇలా చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. ఇక లేట్ అయ్యే కొద్దీ డ్యాన్స్ చేసే భామలు మారిపోతున్నారే తప్ప, ఎవరనేది క్లారిటీ మాత్రం రావట్లేదు. ఇక డైరెక్టర్ బుచ్చి బాబు ఆరు రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అవుతుంది అని ట్వీట్ చేసేసరికి.. ఇపుడు కొత్త టాక్ మొదలైంది.

దర్శకుడి సందిగ్ధం..

లేటెస్ట్ బజ్ ప్రకారం, తెలంగాణ మిస్ ఇండియా మానస వారణాసి, మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్, మరో స్టార్ హీరోయిన్ శృతి హాసన్ పేర్లు వినిపిస్తోన్నాయి. ఈ ముగ్గురిలో శృతి హాసన్ కన్ఫామ్ అయినట్లుగా టాక్. అయితే, ఈ విషయాలపై ఇప్పటివరకు మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

అయితే, స్టోరీ, క్యాస్ట్ సెలక్షన్, షూటింగ్ వంటి అంశాల్లో బుచ్చిబాబు చాలా సమగ్రంగా పని నిర్వర్తించాడు. కానీ, పెద్ది ఐటెం భామ విషయంలో మాత్రం సందిగ్ధంలో పడ్డాడట. ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి వర్సటైల్ యాక్టర్తో స్పెషల్ సాంగ్ అంటే మాములు విషయం కాదని ఆలోచనలో ఉన్నాడట. ఇప్ప‌టికే రెహ‌మాన్ అదిరిపోయే మాస్ సాంగ్ సిద్దం చేసిన‌ట్లు చిత్ర వ‌ర్గాల నుంచి తెలుస్తోంది.

ALSO READ :  గుండెపోటుతో హీరోయిన్ మృతి..

ఈ క్రమంలోనే బుచ్చి, తన గురువు.. ఐటెం సాంగ్ సెలక్షన్లో దిట్ట అయిన సుక్కు మాస్టర్ సాయం కోరినట్లుగా టాక్. ఇక సుక్కు సజెస్ట్ చేస్తే.. ఈ స్పెషల్ సాంగ్ బ్యూటీ ఎవరనేది క్లారిటీ రానుందని సమాచారం. స్పెషల్ సాంగ్‌లో ఎవరు కనిపిస్తారన్నది త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

రూ.200 కోట్ల బ‌డ్జెట్‌!

దాదాపు రూ.200 కోట్ల బ‌డ్జెట్‌తో వృద్ధి సినిమాస్ బ్యాన‌ర్‌పై వెంక‌ట స‌తీష్ కిలారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, సుకుమార్ రైటింగ్స్ ప్ర‌జెంట‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రహమాన్ (AR Rahaman)సంగీతం అందిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రాఫర్గా చేస్తున్నారు.