V6 News

తగ్గుతూపోతున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే షాపర్స్..

తగ్గుతూపోతున్న బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో తాజా రేట్లివే షాపర్స్..

ఇరాన్ అమెరికా మధ్య శాంచి చర్చలు ఇప్పుడప్పుడే ఫలించేలా కనిపించకపోవటంతో గ్లోబల్ బులియన్ మార్కెట్లు సందిగ్ధంలో చిక్కుకున్నాయి. దీంతో 50 రోజులకు పైగా మార్కెట్లు అక్కడక్కడే కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గోల్డ్ ఆర్నమెంట్స్ షాపింగ్ చేయాలనుకుంటున్న తెలుగు ప్రజలు తమ నగరాల్లో తగ్గిన రేట్లను పరిశీలించటం బెస్ట్. 

ఏప్రిల్23న బంగారం రేట్లు తగ్గాయి. ఏప్రిల్ 22 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు దేశవ్యాప్తంగా గ్రాముకు రూ.120 తగ్గుదలను నమోదు చేసింది. అయితే హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.15వేల 355గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.14వేల 075గా కొనసాగుతోంది. 

గురువారం రోజున వెండి రేట్ల విషయానికి వస్తే.. ఏప్రిల్23, 2026న దేశవ్యాప్తంగా కేజీకి రూ.5వేలు తగ్గుదలను నమోదు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు కేజీకి రూ.5వేలు తగ్గి రూ.2లక్షల 70వేలుగా కొనసాగుతోంది. అంటే గ్రాము రూ.270గా అమ్మకాలు జరుగుతున్నాయి.