రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న బుమ్రా

రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న బుమ్రా

ఫస్ట్‌‌ టీ20 కోసం టీమిండియా ప్రాక్టీస్‌‌

గౌహతి : గాయంతో మూడు నెలలకుపైగా ఆటకు దూరంగా ఉన్న ఇండియా స్పీడ్​స్టర్​ జస్‌ప్రీత్​ బుమ్రా శ్రీలంకతో ఆదివారం జరిగే ఫస్ట్‌‌ టీ20తో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ మ్యాచ్‌‌ కోసం శుక్రవారం సాయంత్రం నిర్వహించిన ఆప్షనల్‌‌ ప్రాక్టీస్‌‌ సెషన్‌‌లో మిగిలిన టీమ్‌‌తో కలిసి కసరత్తులు చేశాడు. హెడ్‌‌ కోచ్‌‌ రవిశాస్త్రి, బౌలింగ్‌‌ కోచ్‌‌ భరత్‌‌ అరుణ్‌‌ సమక్షంలో బౌలింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశాడు. తన స్టయిల్‌‌ యార్కర్లు, బౌన్సర్లు వరుసపెట్టి వేస్తూ శ్రీలంక టీమ్‌‌కు హెచ్చరికలు పంపాడు. సింగిల్‌‌ వికెట్‌‌ను టార్గెట్‌‌గా పెట్టుకుని కొన్ని బాల్స్‌‌ వేశాడు. బాల్‌‌కి బాల్‌‌కి మధ్యలో కోచ్‌‌లతో చర్చిస్తూ దాదాపు 45 నిమిషాల పాటు బౌలింగ్‌‌ ప్రాక్టీస్‌‌ చేశాడు. బుమ్రాతో పాటు శార్దూల్‌‌ ఠాకూర్‌‌, శివమ్‌‌ దూబే కూడా ఈ సెషన్‌‌లో పాల్గొన్నారు.  అలాగే,  ఫీల్డింగ్‌‌ సెషన్‌‌లో హై క్యాచెస్​పై  ప్లేయర్లు ఎక్కువగా దృష్టిసారించారు. ఫ్లడ్‌‌ లైట్ల వెలుతురులో కోహ్లీ, బుమ్రా, రాహుల్‌‌, శ్రేయస్‌‌ అయ్యర్‌‌ క్యాచ్‌‌లు అందుకున్నారు. శిఖర్‌‌ ధవన్‌‌, రవీంద్ర జడేజా, నవదీప్‌‌ సైనీ, కుల్దీప్‌‌ యాదవ్‌‌, చహల్‌‌ ప్రాక్టీస్‌‌ సెషన్‌‌కు హాజరు కాలేదు.  మరోపక్క శ్రీలంక టీమ్‌‌ శుక్రవారం పూర్తిగా విశ్రాంతి తీసుకుంది.

మ్యాచ్​కు వాన ముప్పు..

తొలి టీ 20 కి వాన ముప్పు ఉంది. గౌహతిలో శని, ఆదివారాల్లో వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే ఉదయం వర్షం కురిసినా సాయంత్రానికి గ్రౌండ్‌‌ను సిద్ధం చేస్తామని అసోం క్రికెట్​ సంఘం సెక్రటరీ దేవజిత్‌‌ అన్నారు.

Jasprit Bumrah,a comeback after an injury layoff,