కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అత్యాచారం కేసు

కర్ణాకట ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)అత్యాచారం కేసు నమోదు చేసింది. ఈ కేసులో రేవణ్ణలో ఇది రెండో కేసు. అత్యాచారం, క్రిమినల్ బెదిరింపులు సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. గురువారం (మే2)  మేజిస్ట్రేట్ కోర్టుకు ఎఫ్ ఐఆర్ సమర్పించారు సిట్ అధికారులు. మాజీ ప్రధాని , జేడీఎస్ అధినేత హెచ్ డీ దేవెగౌడ మనవడు అయిన ప్రజ్వల్ రేవణ్ణను ఎఫ్ఐఆర్ ఓ ఏకైక నిందితుడిగా చేర్చారు. 

ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది కర్ణాటక సిట్. లైంగికవేధింపుల ఆరోపణలు వచ్చిన వెంటనే ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్ 26న దేశం విడచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్గ్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. 
ప్రజ్వల్ రేవణ్ణ గురువారం సిట్ ముందు హాజరు కావాల్సి ఉంది. అయితే ముందస్తు బెయిల్ కోసం బెంగళూరులోని సెషన్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.