Prasannavadanam Twitter Review: సుహాస్ మళ్ళీ హిట్టు కొట్టాడా? ప్రసన్నవదనం రిజల్ట్ ఏంటి?

Prasannavadanam Twitter Review: సుహాస్ మళ్ళీ హిట్టు కొట్టాడా? ప్రసన్నవదనం రిజల్ట్ ఏంటి?

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా ఫేమ్ సంపాదించుకున్న సుహాస్(Suhas) కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఈ సినిమా జనాలు బాగా కనెక్ట్ అయ్యారు. డైరెక్ట్ ఓటీటీలో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇక అక్కడినుండి వరుస సినిమాలు చేస్తూ సూపర్ హిట్స్ అందుకుంటున్న సుహాస్ ఇటీవలే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇపుడు తాజాగా ప్రసన్నవదనం అనే సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు సుహాస్. 

పేస్ బ్లైండ్ అనే కొత్త కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను సుకుమార్ శిష్యుడు అర్జున్ వైకే తెరకెక్కించాడు. టీజర్, ట్రైలర్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ఈ సినిమా నేడు(మే 3) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే పలుచోట్ల ప్రీమియర్స్ పడటంతో సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు. మరి ప్రసన్నవదనం సినిమా గురించి ఆడియన్స్ ఏమనుకుంటున్నారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. 

ప్రసన్నవదనం సినిమాను ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వస్తోంది. సుహాస్ స్క్రిప్ట్ సెలక్షన్ సూపర్ అని.. ఊహించని ట్విస్టులతో ప్రసన్నవదనం నెక్స్ట్ లెవల్లో సాగిందని, మరోసారి తన అద్భుతమైన నటనతో సుహాస్ అదిరగొట్టేశాడని కామెంట్స్ చేస్తున్నారు. సరికొత్త కథ, దాని ప్రెజెంట్ చేసిన విధానం బాగుందని, ఇంటర్వెల్ టైం లో వచ్చే ట్విస్ట్ మైండ్ బ్లాక్ అని, మొత్తంగా సుహాస్ మరో హిట్ కొట్టేశాడని చెప్పుకుంటున్నారు. మోతంగా సుహాస్ హీరోగా వచ్చిన ప్రసన్నవదనం సినిమాను ఆడియన్స్ నుండి హిట్ టాక్ వస్తోంది. మరి క్లియర్ రివ్యూ తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.