JEE advanced 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా

JEE advanced 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా

జెఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు నేడు(జూన్ 18) విడుదలయ్యాయి. ఐఐటీ గువాహటి విడుదల చేసిన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థి(నాగర్‌కర్నూల్‌) వావిలాల చిద్విలాస్‌ రెడ్డి జాతీయ స్థాయిలో టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. మొత్తం 360 మార్కులకు పరీక్ష జరగ్గా.. చిద్విలాస్​ 341 మార్కులు సాధించాడు. మరోవైపు, అమ్మాయిల కేటగిరీలో టాప్​ ర్యాంక్ కూడా తెలుగు విద్యార్థినికే దక్కడం విశేషం. ఐఐటీ హైదరాబాద్​ జోన్‌కు చెందిన నాయకంటి నాగ భవ్య శ్రీ టాపర్‌గా నిలిచింది. భవ్యశ్రీ 298 మార్కులతో 56వ ర్యాంకు సాధించింది.

జోన్‌ల వారీగా అర్హత సాధించిన అభ్యర్థులు

ఐఐటీ- జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు మొత్తం 1,80,372 మంది అభ్యర్థులు హాజరవ్వగా.. 43,773 మంది అర్హత సాధించారు. ఎక్కువ మంది హైదరాబాద్ జోన్ నుంచి 10,432 అర్హత సాధించడం విశేషం. ఐఐటి ఢిల్లీ జోన్ నుంచి 9,290 మంది, ఐఐటీ బాంబే జోన్ నుంచి 7,957 మంది, ఐఐటీ గౌహతి జోన్ నుంచి 2395 మంది, ఐఐటీ కాన్పూర్ జోన్ నుంచి 4582 మంది, ఐఐటీ ఖరగ్‌పూర్ నుంచి 4618 మంది, ఐఐటీ రూర్కే జోన్ నుంచి 4499 మంది విద్యార్థులు అర్హత సాధించారు.

ఇక జోన్‌ల వారీగా టాప్ 500 ర్యాంకుల్లో ఐఐటీ హైదరాబాద్- 17, ఢిల్లీ – 120, బాంబే – 100, రూర్కీ – 46, ఖరగ్‌పూర్ – 37, కాన్పూర్ – 16, గౌహతి – 4 మంది ఉన్నారు.

టాప్-10 ర్యాంకులు సాధించిన వారు

1. వావిలాల చిద్విలాస్‌ రెడ్డి

2. రమేశ్‌ సూర్య తేజ

3. రిషి కర్లా

4. రాఘవ్‌ గోయల్‌

5. అడ్డగడ వెంకట శివరామ్‌

6. ప్రభవ్‌ ఖండేల్వాల్‌

7. బిక్కిన అభినవ్ చౌదరి

8. మలయ్‌ కేడియా

9. నాగిరెడ్డి బాలాజీ రెడ్డి

10. యక్కంటి ఫణి వెంకట మనీందర్‌ రెడ్డి