పేట్​బషీరాబాద్, జీడిమెట్ల, అల్వాల్ లో సీడీఈడబ్ల్యూ సెంటర్లు

పేట్​బషీరాబాద్, జీడిమెట్ల, అల్వాల్ లో సీడీఈడబ్ల్యూ సెంటర్లు

జీడిమెట్ల/అల్వాల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం మహిళల సేఫ్టీకి ఇంపార్టెన్స్ ఇస్తోందని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. పేట్ బషీరాబాద్, అల్వాల్ పోలీస్ స్టేషన్లలో సీడీఈడబ్ల్యూ(సెంటర్ ఫర్ డెవలప్​మెంట్ ఆఫ్ విమెన్ సొసైటీ) సెంటర్లను, విమెన్ సేఫ్టీ కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ వెహికల్​ను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. చిన్న చిన్న సమస్యలకు భార్యాభర్తలు విడిపోకుండా  కౌన్సిలింగ్ నిర్వహించి వారిని కలిపేందుకు ఈ సెంటర్లు పనిచేస్తాయని చెప్పారు. కార్యక్రమంలో సీడీఈడబ్ల్యూ, చిల్డ్రన్​ సేఫ్టీ వింగ్ డీసీపీ నిఖిత్ పంత్, పేట్ బషీరాబాద్ ఏసీపీ రామలింగరాజు, మేడ్చల్ ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసరావు, సీఐలు పాల్గొన్నారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన సీడీఈడబ్ల్యూ సెంటర్​ను డీసీపీ శ్రీనివాసరావు ప్రారంభించారు.