మేము ఎలాంటి తప్పు చేయలేదు

మేము ఎలాంటి తప్పు చేయలేదు

చెక్ బౌన్స్ కేసుపై జీవితా రాజశేఖర్ స్పందించారు. తాము ఎలాంటి తప్పు చేయలేదన్నారు. గరుడ వేగ సినిమాకు సంబంధించిన లావాదేవీల విషయంలో జీవితా రాజశేఖర్ తమను మోసం చేశారంటూ జోస్టార్స్ ప్రొడక్షన్ కు చెందిన కోటేశ్వరరాజు, మేనేజింగ్ డైరెక్టర్ హేమ చేసిన ఆరోపణలపై.. శేఖర్ మూవీ ప్రెస్ మీట్ లో పాల్గొన్న జీవిత వివరణ ఇచ్చారు. తమపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవి అంటూ కొట్టిపారేశారు. సుమారు రెండు నెలల నుంచి ఈ కేసు కోర్టులో ఉందని, తాజాగా కోటేశ్వరరాజు, హేమ ప్రెస్ మీట్ పెట్టి తమపై ఆరోపణలు ఎందుకు చేశారో తెలియదన్నారు. ఈ కేసుకు సంబంధించి 2 నెలల క్రితమే వారెంట్ వచ్చిందని, తనకెలాంటి సమన్లు అందలేదన్నారు. ఈ విషయంలో తాము దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 

గరుడవేగ సినిమా నిర్మించిన జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వర రాజు రూ.26 కోట్ల డబ్బు తమకు ఎలా ఇచ్చారో కోర్టులో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం తనపై ఉందన్నారు. నగరి కోర్టు తీర్పు తర్వాత అన్ని వివరాలు చెబుతామన్నారు. తమపై ఆరోపణలు చేసిన వారు చాలా తప్పులు చేశారని చెప్పారు జీవిత. ఆరోపణలు వచ్చిన సమయంలో తాము ఎక్కడకు పారిపోలేదన్నారు. ప్రముఖుల విషయంలో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అది కరెక్టో కాదో.. తెలుసుకోకుండానే యూట్యూబ్ లో  థంబనెల్స్ తో ఇష్టం వచ్చినట్లు పెట్టడం సరికాదని, దాని వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు.ఈ మధ్య తమ కూతుళ్ల గురించి, ఇటీవల నిహారిక, మోహన్ బాబుపై కూడా ఇలాగే యూట్యూబ్ లో పెట్టారని, దయచేసి ఇలా ఇష్టం వచ్చినట్లు థంబనేల్స్ పెట్టి, ఎవర్నీ ఇబ్బందులకు గురి చేయవద్దని కోరారు. 

పీఎస్వీ గరుడవేగ సినిమాకు ఆస్తులు తాకట్టు పెట్టి జీవితా రాజశేఖర్ కు రూ.26 కోట్లు అప్పులు ఇచ్చామని జ్యో స్టార్ ఫిలిం ప్రొడక్షన్ ఫౌండర్ కోటేశ్వర రాజు,మేనేజింగ్ డైరెక్టర్ హేమ ఆరోపించారు. 2017లో సైలెంట్ గా వచ్చి హిట్ కొట్టిన మూవీ పీఎస్వీ గరుడవేగ.ప్లాపులతో సతమతం అవుతున్న హీరో రాజశేఖర్ కు ఈ సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. తాజాగా ఈ మూవీ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. 

 

మరిన్ని వార్తల కోసం..

ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణ రెడ్డి సస్పెన్షన్

ముంబయిలో కొనసాగుతున్న హనుమాన్‌ చాలీసా వివాదం