తెరుచుకున్న జెరూసలేం చర్చి

తెరుచుకున్న జెరూసలేం చర్చి

జెరూసలేం: కరోనా ఎఫెక్టుతో రెండు నెలల పాటు మూసివేత తర్వాత జెరూసలేం చర్చ్ ఆఫ్ ది హోలీ సెపల్చర్ సందర్శకుల కోసం ఆదివారం తిరిగి తెరుచుకుంది. చర్చి అధికారులు ఒకేసారి 50 మందికి ప్రవేశాన్ని పరిమితం చేశారు. కావెర్నస్ సైట్‌లోకి ప్రవేశించే వారు డిస్టెన్స్ మెయింటేన్ చేయాలని, చర్చి రాళ్ళు, చిహ్నాలు, ఇతర మతపరమైన వస్తువులను తాకకుండా ఉండాలని కండిషన్లు పెట్టారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేని మాస్కులు ధరించిన వారిని మాత్రమే లోనికి అనుమతించారు. ఇజ్రాయెల్, పాలస్తీనా భూభాగాల్లో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు తీసుకున్న చర్యల్లో భాగంగా ఈస్టర్ సెలవుదినానికి ముందు రోజు మార్చి 25 న జెరూసలేం చర్చి మూసివేశారు. ఇప్పటివరకు ఇజ్రాయెల్​లో 16,700 కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి, వైరస్ బారిన పడి 279 మంది చనిపోయారు. 14,085 మంది రికవరీ అయ్యారు.