ఏడేళ్లకే సిక్స్‌ప్యాక్‌ బాడీని సాధించిన చిన్నారి పూజ బిష్ణోయ్

ఏడేళ్లకే సిక్స్‌ప్యాక్‌ బాడీని సాధించిన చిన్నారి పూజ బిష్ణోయ్

సిక్స్‌ప్యాక్‌ బాడీ అంటే ప్రధానంగా సినీ నటులు గుర్తొస్తారు. స్క్రీన్ పై తమ బాడీని చూపించడానికి ఎంతో కసరత్తుచేస్తారు. కండలు తిరిగిన శరీరాన్ని పొందాలంటే సామాన్యమైన విషయం కాదు. నిరంతర కఠోర సాధనతోనే సాధ్యమవుతుంది. అయితే పురుషులు మాత్రమే సిక్స్‌ప్యాక్‌ బాడీని పొందగలరు అని ఆలోచించేవాళ్లకి ఓ బాలిక తమ అభిప్రాయాన్ని మార్చుకునేలా చేసింది.

రాజస్థాన్‌ జోధ్‌పూర్‌కు చెందిన 9ఏళ్ల పూజ బిష్ణోయ్ అనే బాలిక.. ఏడేళ్లకే సిక్స్‌ప్యాక్‌ బాడీ సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. పూజ సిక్స్‌ప్యాక్‌ బాడీనే కాదండోరు... తన మామ అథ్లెట్‌ శ్రావణ్‌ ప్రోత్సాహంతో ఐదేళ్ల నుంచే క్రికెట్‌ ఆడటం ప్రారంభించింది. ఫాస్ట్‌బౌలర్‌గా తన ప్రతిభను చాటింది. పూజ ప్రతిభను గుర్తించిన విరాట్‌ కోహ్లీ ఫౌండేషన్‌ ప్రోత్సాహం అందించి.. శిక్షణ ఇస్తోంది. పూజ ఇప్పటికే ఎంఎస్‌ ధోనీ, పలువురు బాలీవుడ్‌ సెలబ్రిటీలతో కలిసి యాడ్స్‌లోనూ నటించింది.

 పూజ రోజూ ఉదయాన్నే మూడు గంటలకు నిద్రలేచి వ్యాయామం ప్రారంభిస్తుంది. చదువును నిర్లక్ష్యం చేయకుండా ఆన్‌లైన్‌ క్లాసులకు హాజరవుతుంది. తర్వాత మళ్లీ వ్యాయామం చేస్తుంది. ఇప్పటికే 2019 ఇండియన్‌ స్పోర్ట్స్‌ హానర్‌ 100 మీటర్ల పరుగు విభాగంలో పూజ స్వర్ణ పతకం సాధించింది. 2024లో జరగబోయే యూత్‌ ఒలింపిక్స్‌లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించాలనేది తన లక్ష్యం చెప్పుకొచ్చింది.