ఎన్ఎంసీ బిల్లును వెనక్కి తీసుకోవాలె: జూడాల ఆందోళన

ఎన్ఎంసీ బిల్లును వెనక్కి తీసుకోవాలె: జూడాల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో ప్రవేశపెట్టిన నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) బిల్లుకు వ్యతిరేకంగా జూనియర్​ డాక్టర్లు ఆందోళనబాట పట్టారు. ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్​ చేస్తూ ఉస్మానియా మెడికల్ కాలేజీ, నిమ్స్ లో జూడాలు నిరసనకు దిగారు. ఉస్మానియాలో గంట పాటు ఎలక్టివ్ సర్వీస్ లను బాయ్ కాట్ చేశారు. ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఓపీ భవనం వద్ద ఆందోళన చేశారు. ఎన్ఎంసీ బిల్లు కారణంగా మెడికల్ సీట్ల ధరలు భారీగా పెరుగుతాయని, దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని జూడాలు డిమాండ్​ చేశారు. నిమ్స్ లో రెసిడెంట్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఆందోళనలు చేశారు. ఎన్ఎంసీ బిల్లులోని కొన్ని క్లాజులపై రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు. నెక్ట్స్ పేరుతో నిర్వహించాలని భావిస్తున్న ప్రవేశ పరీక్ష సరికాదని, బ్రిడ్జ్ కోర్సు అవసరం లేదన్నారు. మెడికల్ కాలేజీల్లో సీట్లకు సంబంధించి 50 శాతం సీట్లపైనే ప్రభుత్వ నియంత్రణ ఉంటుందని, మిగతా సీట్ల ఫీజులు భారీగా పెరుగుతాయని చెప్పారు. ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునే
వరకూ తమ ఆందోళన కొనసాగిస్తామని శ్రీనివాస్​ చెప్పారు.