కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా ‘కళోపాసన-2026’

 కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా ‘కళోపాసన-2026’

నృత్య దీక్షాలయ ఆధ్వర్యంలో నృత్య గురువు లక్ష్మీ శంకర్ మార్గదర్శకత్వంలో నిర్వహించిన కళోపాసన-–2026 నాలుగో ఎడిషన్ శనివారం కింగ్ కోఠిలోని భారతీయ విద్యాభవన్‌లో ఘనంగా జరిగింది. 

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదుగురు యువ కళాకారిణులు శ్రావణి ముదిరాజ్, సయోజి ఆశ్రిత, రుత్విక నలమలపు, లక్ష్మీ రఘునాథ్, శ్రుతి సామన్వి కూచిపూడి నృత్య ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. యామిని రెడ్డి, లహరి కొలాచెల ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
  – అబిడ్స్, వెలుగు