ఇంటి పనిని వేతన వృత్తిగా గుర్తిస్తామన్న కమల్.. తప్పుపట్టిన కంగన

ఇంటి పనిని వేతన వృత్తిగా గుర్తిస్తామన్న కమల్.. తప్పుపట్టిన కంగన
ప్రముఖ సినీ నటుడు, మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమలహాసన్ పూర్తి స్థాయిలో రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ ఎన్నికల క్రమంలో ప్రచారపర్వంలో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా తాము అధికారంలోకి వస్తే ఇంటి పనిని కూడా వేతన వృత్తిగా గుర్తిస్తామని అన్నారు కమల్. కమల్ ఆలోచనను కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కూడా ప్రశంసించారు. అయితే.. ఈ వ్యాఖ్యలను బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తప్పు పట్టారు. ఇంట్లో మహిళ చేసే పనికి విలువ కట్టొద్దన్నారు కంగనా. మాతృత్వానికి, అమితంగా ప్రేమించే వ్యక్తులతో శృంగారానికి వెల కట్టొద్దని చెప్పారు. ప్రతి విషయాన్ని వ్యాపారంగా చూడొద్దన్నారు. మహిళలను కావాల్సింది వేతనం మాత్రమే కాదని… ప్రేమ, గౌరవం అని చెప్పారు కంగనా రనౌత్.