ఫ్యాన్స్​కు రిక్వెస్ట్​

ఫ్యాన్స్​కు రిక్వెస్ట్​

‘కేజీఎఫ్’ సిరీస్‌‌తో  ప్యాన్ ఇండియావైడ్‌‌గా గుర్తింపును అందుకున్నాడు కన్నడ హీరో యశ్. అయితే ‘కేజీఎఫ్2’ తర్వాత యశ్ ఇప్పటివరకు మరో ప్రాజెక్ట్‌‌ని అనౌన్స్ చేయలేదు. తమ అభిమాన హీరో నెక్స్ట్ మూవీకోసం ఈగర్‌‌‌‌గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. జనవరి 8న యశ్ పుట్టిన రోజు కావడంతో కచ్చితంగా కొత్త సినిమాతో గుడ్ న్యూస్ చెబుతాడని భావించారు. ఈ సందర్భంగా యశ్ ఓ లెటర్‌‌‌‌ని రిలీజ్ చేశాడు. ‘నా అభిమానులే నా బలం.. నా పుట్టినరోజు సందర్భంగా ఏడాదిపాటు మీరు చూపిస్తున్న ప్రేమ, ఆప్యాయత నా హృదయాన్ని కృతజ్ఞతతో నింపుతోంది.

అన్ని రోజుల్లాగే పుట్టిన రోజూ నాకు సాధారణమే. దాన్ని స్పెషల్ డే గా చూడను. కానీ మీరంతా పరిచయమైన దగ్గర నుంచి ఆరోజు ప్రత్యేకంగా మారింది.  ఓ ప్రాజెక్ట్ విషయంలో ఎంతో ఆసక్తిగా పనిచేస్తున్నా. ఆ వివరాలు మీకు చెప్పేందుకు నాకు కొంత సమయం కావాలి. అప్పటి వరకు ఓపిక పట్టండి.  అదే ఈ ఏడాది పుట్టినరోజుకు మీరు నాకు ఇచ్చే కానుక. మాటిస్తున్నా. మిమ్మల్ని నిరాశ పరచను. జనవరి 8న నేను ఇక్కడ ఉండడం లేదు. మీ అందరినీ కలుసుకోలేను. కానీ ప్రతి ఒక్కరి విష్ నాకు చాలా విలువైంది’  అంటూ యశ్ లెటర్‌‌‌‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.