కృష్ణా నీటిని ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలిస్తోందని... ఏపీ అక్రమాలను అడ్డుకోవడంలో రాష్ట్ర సర్కార్ పూర్తిగా విఫలమైందని ధ్వజమెత్తారు టీఆర్ఎస్ చీఫ్ కవిత.
ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న బనకచర్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అడ్డుకోవాలన్నారు. తెలంగాణ వనరులను కాంగ్రెస్ పార్టీ దోచుకు తింటోందని ఆరోపించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైఖరి కూడా సరికాదన్నారు కవిత. ముఖ్యమంత్రి ఫ్యామిలీతో కేటీఆర్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు. మరోవైపు, తెలంగాణలో బీజేపీకి అసలు నాయకులే లేరంటూ సెటైర్ వేశారు.
ఇక ప్రభుత్వ భూముల విక్రయాలపై కాంగ్రెస్ సర్కార్‌ను కవిత గట్టిగా నిలదీశారు. ప్రభుత్వ భూములను అమ్మేస్తే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ భూములను రక్షించే బాధ్యతను తాము తీసుకుంటామని... భూముల వేలాన్ని అడ్డుకుంటామని కవిత స్పష్టం చేశారు.
