విద్యార్థులపై లాఠీఛార్జీ సరికాదు.. ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ

విద్యార్థులపై లాఠీఛార్జీ సరికాదు.. ప్రధాని క్షమాపణ చెప్పాలి: రాహుల్ గాంధీ

కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలు, మద్ధతు దారులు, స్టూడెంట్స్ పై పోలీసుల లాఠీఛార్జీ భారత విధానం కాదని రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళవారం (జులై 21) పార్లమెంట్ ఆవరణలో రిపోర్టర్స్ తో మాట్లాడిన రాహుల్.. ప్రధాని మోదీ మౌనంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 

సోమవారం మహిళలు, విద్యార్థినులు అని కూడా చూడకుండా అమానవీయ పద్ధతిలో పోలీసులు దాడులు చేశారు. దీనిపై ప్రధాని మోదీ ఇప్పటికీ క్షమాపణలు చెప్పకపోవడం దారుణం అని అన్నారు.

ఉదయం పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు ఎంపీలతో కలిసి లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను కలిసిన రాహుల్.. పేపర్ లీకేజీ, విద్యార్థులపై లాఠీ చార్జీ అంశంపై చర్చ చేపట్టాలని కోరారు. దీనికి స్పీకర్ ఒప్పుకోలేదని అన్నారు. సభలో చర్చ చేపట్టాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితి స్పీకర్ ది అని అన్నారు. 

స్పీకర్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. సెంట్రల్ గవర్నమెంట్ అనుమదతి తీసుకోవాలని స్పీకర్ డైరెక్టుగా చెబుతున్నారు.. అని అన్నారు. 

మా డిమాండ్ సింపుల్.. విద్యార్థులను క్రూరంగా కొట్టిన అంశంపై డిబేట్ జరగాలి. పరీక్షల సంక్షోభం విషయంలో ప్రభుత్వం బాధ్యత లేకపోవడంపై చర్చ జరగాలి. అని  అన్నారు. 

దేశ భవిష్యత్తు అయిన యువత గురించి పార్లమెంటు చర్చించదా?? అంటూ ప్రశ్నించారు. దీన్ని ప్రతిపక్షం వదిలిపెట్టదని.. విద్యార్థులకు మద్ధతుగా పోరాడుతామని హెచ్చరించారు.