- తెలంగాణ భవన్ గేటునూ తాకనివ్వం
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి స్పష్టం
హైదరాబాద్, వెలుగు: కొండా సురేఖను ఎట్టిపరిస్థితుల్లో బీఆర్ఎస్లోకి రానివ్వబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ గేటును కూడా తాకనివ్వబోమని స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్లో మీడియాతో చిట్చాట్చేశారు. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల్లో ఒకరిద్దరిని తప్ప ఎవరిని తీసుకోబోమన్నారు. ఎమ్మెల్యేల క్యారెక్టర్ ఆధారంగా వస్తామంటే తీసుకుంటామని చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇద్దరు బీఆర్ఎస్ లోకి రావడానికి రెడీగా ఉన్నారని తెలిపారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్లికేషన్ పెట్టినా తీసుకోబోమన్నారు. ఎన్నికల కంటే ముందు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి ఇద్దరూ బీఆర్ఎస్ లోకి వస్తామంటే తీసుకోలేదని తెలిపారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే డబ్బులకు అమ్ముడు పోయినట్టేనన్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా రెండు తెలుగు రాష్ట్రాల్లో డీలిమిటేషన్ జరుగుతుందన్నారు. ఏపీలో చంద్రబాబుకు వ్యతిరేకత స్టార్ట్ అయిందన్నారు. డీలిమిటేషన్ జరిగితే ప్రజావ్యతిరేకత నుంచి బయటపడవచ్చని చంద్రబాబు
భావిస్తున్నారని తెలిపారు.
