హైదరాబాద్, వెలుగు: లాంగ్వేజ్ లెర్నింగ్ ప్లాట్‌ఫారమ్ డ్యూలింగో 37.6 కోట్ల మంది ఎయిర్‌టెల్ కస్టమర్లకు ఏడాదిపాటు తమ సేవలను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. మొబైల్, వైఫై, డీటీహెచ్ వినియోగదారులు ఎయిర్‌టెల్ యాప్ ద్వారా ఈ ప్రీమియం ఫీచర్‌ను పొందవచ్చు. యాప్ ద్వారా ఏఐ ఆధారిత రియల్ టైమ్ స్పీకింగ్ ప్రాక్టీస్, అడ్వాన్స్డ్ లెర్నింగ్ టూల్స్ అందుబాటులో ఉంటాయి. హిందీ, బెంగాలీ, తెలుగు, తమిళం, ఉర్దూతో పాటు తాజాగా పంజాబీ నుంచి ఇంగ్లిష్ నేర్చుకునే సదుపాయాన్ని కూడా తీసుకొచ్చారు. 40కి పైగా భాషలతో పాటు మ్యాథ్స్, మ్యూజిక్, చెస్ నేర్చుకునేందుకు డ్యూలింగో ఉపయోగపడుతుంది.
