కష్టకాలంలో కోహ్లీకి ఫోన్.. పీవీ సింధు ఆటతీరునే మార్చేసిన కింగ్ సలహా

కష్టకాలంలో కోహ్లీకి ఫోన్.. పీవీ సింధు ఆటతీరునే మార్చేసిన కింగ్ సలహా

 ఇండియా బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు దాదాపు రెండేళ్ల తర్వాత మేజర్ టైటిల్ గెలుచుకుంది. జపాన్ ఓపెన్ 2026 టైటిల్ విన్ తో  ఈ టోర్నమెంట్‌ను గెలిచిన తొలి ఇండియన్ విమెన్ గా  చరిత్ర సృష్టించింది. ఇన్నాళ్లు సతమతం అవుతూ.. కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సింధు విజయం వెనుక.. ఆమె ఆట తీరు మారటం వెనుక.. కింగ్ కోహ్లీ సలహా ఉండటం విశేషం. 

ఫార్మ్ కోల్పోయి కష్టకాలం ఎదుర్కొంటున్న సమయంలో సింధు క్రికెట్ లెజెండ్ విరాట్ కోహ్లీకి కాల్ చేసింది. చాలా కాలంగా సెంచరీలు లేక.. ఫామ్ లేమితో ఇబ్బంది పడిన సమయంలో మీరు ఏం చేశారు.. ఎలా ఓవర్ కమ్ అయ్యారని సింధు అడిగిందట.  దానికి కోహ్లి ఇచ్చిన సమాధానం..రన్స్ స్కోర్ చేయడంలో ఉన్న హ్యాపీనెస్ ను మళ్లీ కనుగొన్నాను అని రిప్లై ఇచ్చాడట. రన్స్ చేయడం ఆస్వాదిస్తుంటే సెంచరీలు వాటంతట అవే వచ్చినట్లు చెప్పాడట. 

ఈ మాటలు సింధు మనసులో గాఢంగా ముద్రపడ్డాయి. ఆట పట్ల పాజిటివ్ వైఖరిని డెవలప్ చేసుకుని.. ఆడటమే మన పని.. రిజల్ట్స్ తర్వాత వస్తాయి అనే దృక్పథంతో ముందుకు సాగినట్లు చెప్పారు సింధు. ఆ ఫలితంగానే తన ఆటలో ఎంతో మార్పు వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో కోహ్లీకి కృతజ్ఞతలు చెప్పారు. 

సింధు రీవైవల్‌కు 13 మంది సభ్యుల టీమ్, స్పోర్ట్స్ సైన్స్, డైట్ కూడా ఎంతో దోహదపడ్డాయి. ప్యారిస్ ఒలింపిక్స్ తర్వాత డేటా విశ్లేషణలో అటాకింగ్ మైండ్‌సెట్ తగ్గడం, ఎక్కువ లైన్ జడ్జ్‌మెంట్లు వంటి సమస్యలు బయటపడ్డాయి. దీన్ని సరిద్దుకున్నారు. జపాన్ ఓపెన్ ముందు 3.5 కేజీలు తగ్గడం, ప్రోటీన్‌కు చికెన్ డైట్‌తోపాటు కఠిన శిక్షణ ఫలితంగా అకానే యమగుచి పై ఫైనల్‌లో విజయం సాధించింది. విరాట్ కోహ్లి సలహా సింధుకు గేమ్ చేంజర్‌గా నిలిచింది!