ఆర్టీసీ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు

ఆర్టీసీ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం తర్వాత మొదటిసారి నిర్వహించిన ఆర్టీసీ పాలకవర్గం సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చాలని నిర్ణయించామని ఆర్టీసీ ఛైర్మెన్ బాజిరెడ్డి గోవర్ధన్  తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. సుమారు 1,200 మందికి కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇవ్వనున్నారు. మరోవైపు ఆర్టీసీకి ఆదాయం వచ్చే అన్ని మార్గాలపైనా చర్చించారు. దాదాపు 1000 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దూర ప్రాంతాల కోసం ఏసీ, నాన్ ఏసీ, స్లీపర్ కోచ్ బస్సులను తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. 

ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితులపై చర్చించామని సంస్థ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ఆర్టీసీ సాధించిన ఫలితాలతో పాటు ఏడేళ్లుగా సంస్థకు జరిగిన నష్టంపైనా చర్చించామన్నారు. ప్రధానంగా డీజిల్ ధరలు పెరగడం ద్వారా ఆర్టీసీకి నష్టం వాటిల్లిందన్నారు. కోవిడ్ సమయంలో ప్రజలకు ఆర్టీసీ సిబ్బంది అందించిన సేవలను బోర్డు అభినందించిందని చెప్పారు. తార్నాక ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చి, సాధారణ ప్రజలకు వైద్యం అందించాలనే ప్రతిపాదనను బోర్డు ఆమోదించిందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. 

మరిన్ని వార్తల కోసం..

రష్యాపై భారత్ ఆధారపడటం మాకు నచ్చట్లే

పీకే రాకను స్వాగతిస్తాం